బీహార్ ఎలక్షన్స్: మరో వివాదంలో ప్రశాంత్ కిషోర్: రెండు రాష్ట్రాల్లో ఓటు నమోదుపై ఈసీ నోటీసులు

బీహార్ ఎలక్షన్స్: మరో వివాదంలో ప్రశాంత్ కిషోర్: రెండు రాష్ట్రాల్లో ఓటు నమోదుపై ఈసీ నోటీసులు

ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకునిగా అవతారం ఎత్తిన ప్రశాంత్ కిషోర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉండటంపై మంగళవారం (అక్టోబర్ 28) కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. సొంత రాష్ట్రమైన బీహార్ తో పాటు వెస్ట్ బెంగాల్ లో ఓటు నమోదు కావడంపై నోటీసులు పంపింది. 

పశ్చిమబెంగాల్ లోని నార్త్ కోల్కతా పార్లమెంటరీ కింద.. మనిక్తాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. వార్డు నెంబర్ 621 లో ప్రశాంత్ కిశోర్ ఓటు కలిగి ఉన్నారని.. వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసింది ఎన్నికల సంఘం. 

ప్రశాంత్ కిషోర్ కు తన సొంత రాష్ట్రమైన బీహార్ లో కరాకత్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉంది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 17 ప్రకారం, ఏ వ్యక్తి  ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఓటు కలిగి ఉండకూడదు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్, 1950లోని సెక్షన్ 31 ప్రకారం శిక్షార్హులని ఎన్నికల సంఘం నోటీసుల్లో పేర్కొంది.  జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటినీ విధించే అవకాశం ఉందని తెలిపింది. ఈ అంశంపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. 

2021 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు ప్రశాంత్ కిషోర్. అ సమయంలో ఆయనకు అక్కడ ఓటు హక్కు లభించింది. అయితే ప్రస్తుతం బీహార్ ఎన్నికల్లో పాల్గొంటున్న సందర్భంగా.. వెస్ట్ బెంగాల్ లో ఉన్న ఓటును రద్దు చేయించుకోవాల్సి ఉంది. స్పెషల్ రివిజన్ (SIR) లో భాగంగా దేశ వ్యాప్తంగా ఓటరు జాబితా సవరణ చేస్తున్న ఈసీ.. రెండు ఓట్లు కలిగి ఉండటంపై ప్రశాంత్ కిషోర్ కు నోటీసులు జారీ చేసింది. 

►ALSO READ | 8th Central Pay Commission:8వ వేతన సంఘానికి కేబినెట్ఆమోదం.. భారీగా పెరగనున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు!