8th Central Pay Commission:8వ వేతన సంఘానికి కేబినెట్ఆమోదం.. భారీగా పెరగనున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు!

8th Central Pay Commission:8వ వేతన సంఘానికి కేబినెట్ఆమోదం.. భారీగా పెరగనున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు!

8వ వేతన సంఘం నిబంధనలకు కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది. మంగళవారం (అక్టోబర్​ 28) ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్​భేటీలో 8వ వేతన సంఘం (8th Central Pay Commission) కూర్పు, నియమనిబంధనలు, కాలవ్యవధిని కేబినెట్​ ఆమోదించింది. ఈ నిర్ణయంతో రక్షణ సేవల సిబ్బందితో సహా దాదాపు 50లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లకు వర్తిస్తుంది. వేతన సంఘం సిఫారసులతో ఉద్యోగులకు జీతాలు పెరిగే ఛాన్స్​ ఉంటుంది. వేతన సంఘం ఏర్పాటు తేదినుంచి 18 నెలల్లోగా సిఫారసులు సమర్పించనుంది. 

వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఇతర ప్రయోజనాలను సమీక్షించి  సవరణలను అందించనుంది. 2025 జనవరిలో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రకటించినప్పటికీ దాని ఏర్పాటు, పనితీరు మార్గదర్శకాలను ఇప్పుడు కేంద్ర కేబినెట్​ ఆమోదించింది. 

8వ వేతనం సంఘం .. 

కేంద్ర వేతన సంఘం (CPC) అనేది భారత ప్రభుత్వం ఏర్పాటు చేసే ఒక స్వతంత్ర సంస్థ. దీనికి చైర్మన్​, పార్ట్​ టైం మెంబర్​, మెంబర్​ సెక్రటరీ ఉంటారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ సైనికులు, పెన్షనర్ల భత్యాలు, పెన్షన్లు, ఇతర ప్రయోజనాలను సమీక్షించి, సిఫార్సులు చేస్తుంది. 1946లో మొదటి సంఘం ఏర్పాటు చేశారు.

►ALSO READ | Delhi artificial rain: ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ సక్సెస్.. సాయంత్రం 7గంటల లోపు కృత్రిమ వర్షం!

సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ సంఘాన్ని ఏర్పాటు చేస్తారు.దేశ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, ఉద్యోగుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకుని, జీతాల్లో 20-35శాతం పెరుగుదలకు దారితీస్తాయి. ప్రస్తుతం 8వ సంఘం 2025 జనవరి 16న ఏర్పాటు ప్రకటించారు. 2025 అక్టోబర్ 28న దాని నిబంధనలు (Terms of Reference -ToR) ఆమోదించింది కేబినెట్​. 

8వ వేతన సంఘం అమలు.. 

7వ వేతన సంఘం సిఫార్సులు 2016 జనవరి 1 నుంచి అమలులో ఉన్నాయి. అదే ట్రెండ్​  కొనసాగితే.. 8వ సంఘం సిఫార్సులు 2026 జనవరి 1 నుంచి అమలులయ్యే అవకాశం ఉంది.వేతన సంఘాన్ని ప్రతి 10 ఏళ్లకు ఒకసారి నియమిస్తారు. 

ఉద్యోగులకు గుడ్​ న్యూస్​ చెప్పేనా?..

ఈ సంఘం సిఫార్సులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లో 20నుంచి-30% పెరుగుదలకు ఉండొచ్చని తెలుస్తోంది. అదనంగా పెన్షన్లు, భత్యాలు, ఇతర ప్రయోజనాలు కూడా పెరిగే ఛాన్స్​ ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు ,పబ్లిక్ సెక్టార్ యూనిట్లపై కూడా ప్రభావం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.