పట్టు వస్త్రాల నేత పనులు ప్రారంభం

పట్టు వస్త్రాల నేత పనులు ప్రారంభం

కొడిమ్యాల, వెలుగు: కొండగట్టు అంజన్న పెద్దజయంతి ఉత్సవాల సందర్భంగా స్వామివారికి అందించనున్న ప్రత్యేక పట్టు వస్త్రాల నేత పనులను శనివారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. పట్టువస్త్రాలను తయారు చేసేందుకు 10 మంది సికింద్రాబాద్ పద్మశాలీ చేనేత కార్మికులు కొండగట్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులను ప్రోత్సహించడానికి ప్రత్యేక పథకాల రూపొందిస్తుందన్నారు.