మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదు: చైనా

మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదు: చైనా

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్నంతా అతలాకుతలం చేసింది. ధనిక దేశం, పేద దేశం అనే తేడా లేకుండా అన్ని దేశాలు దీని దెబ్బకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అన్ని దేశాలు ఉంటే… చైనా మాత్రం ప్రశాంతంగా ఉంది. అంతేకాదు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మాస్క్‌ ధరించాల్సిన అవసరం లేదంటోంది. దీనికి సంబంధించి ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక మీదట బీజింగ్‌ ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించాల్సిన అవసరం లేదని తెలిపారు. వరుసగా 13 రోజులుగా ఇక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రజలు మాత్రం మాస్క్‌ ధరించే జర్నీ చేస్తున్నారు.సామాజిక ఒత్తిడి, సురక్షితను దృష్టిలో పెట్టుకుని మాస్క్‌ ధరిచండానికే ప్రజలు ఇష్టపడుతున్నారు.