దసరా కానుకగా బెల్లంకొండ స్వాతిముత్యం

దసరా కానుకగా  బెల్లంకొండ స్వాతిముత్యం


బెల్లంకొండ గణేష్ హీరోగా రూపొందిన ‘స్వాతిముత్యం’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు లక్ష్మణ్ కె. కృష్ణ చెప్పిన విశేషాలు. 

“మాది తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం. స్కూల్‌‌‌‌ డేస్‌‌‌‌లోనే డ్రామాలు రాసేవాణ్ని. తర్వాత షార్ట్ ఫిల్మ్స్ తీశాను. సినిమాలపై ఇష్టంతో ఇంజినీరింగ్ మధ్యలోనే ఆపేసి హైదరాబాద్‌‌‌‌ వచ్చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా ట్రై చేశాను కానీ వర్కవుట్ కాలేదు. మళ్లీ  షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ‘కృష్ణమూర్తి గారింట్లో’కి సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్‌‌‌‌లో బెస్ట్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ అవార్డు వచ్చింది. తర్వాత సినిమా ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఇంతలో లాక్ డౌన్ రావడంతో మంచి ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ రాయాలని ఈ సినిమా స్టోరీ రాశాను. మన చుట్టూ జరిగే సంఘటనల ఆధారంగానే రాశాను.

నా ఫ్రెండ్‌‌‌‌కి గణేష్  బాగా తెలియడంతో తనకి వినిపించాను. తనకి, వాళ్ల ఫాదర్ సురేష్‌‌‌‌ గారికి కూడా బాగా నచ్చింది. సితార బ్యానర్‌‌‌‌‌‌‌‌ నిర్మించడానికి ముందుకొచ్చింది. బాల మురళీకృష్ణ అనే పాత్రలో కనిపిస్తాడు గణేష్. ఇంజినీరింగ్ పూర్తిచేసి, చిన్న టౌన్‌‌‌‌లో జూనియర్ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌గా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటాడు. ఇంట్లోవాళ్లు సంబంధాలు చూడటం మొదలుపెడతారు. ఆ ప్రాసెస్‌‌‌‌లో ఎదురయ్యే కష్టాల్ని ఇంటరెస్టింగ్‌‌‌‌గా చూపించబోతున్నాం. ‘96’ చూసినప్పుడే నేను కనుక డైరెక్టర్ అయితే వర్షతో వర్క్ చేయాలనుకున్నా. కొన్ని ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ మధ్య జరిగే కథ కాబట్టి ఈ టైటిల్‌‌‌‌ అనుకున్నాం. కమల్   గారి పాత్రతో పోలుస్తారేమోనని భయమేసినా, ప్రొడ్యూసర్ సపోర్ట్‌‌‌‌తో ముందుకెళ్లాం. ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ కాబట్టి ఫెస్టివల్‌‌‌‌కి వస్తేనే బాగుంటుంది. ఆ టైమ్‌‌‌‌లో గాడ్ ఫాదర్, ఘోస్ట్ తో పాటు మరికొన్ని రిలీజవుతున్నాయి కనుక కొంచెం భయంగా, కొంచెం సంతోషంగా ఉంది. చిరంజీవి గారి సినిమాతో పాటు నా మూవీ విడుదలవడం హ్యాపీ. నెక్స్ట్ ప్రాజెక్టు మళ్లీ ఇదే బ్యానర్‌‌‌‌‌‌‌‌లో చేసే చాన్స్ ఉంది.’’