Tyson Naidu First Glimpse: మాస్ అవతార్లో..బెల్లంకొండ అదరగొట్టేసాడు..

Tyson Naidu First Glimpse: మాస్ అవతార్లో..బెల్లంకొండ అదరగొట్టేసాడు..

బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas) హీరోగా భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కె చంద్ర(Saagarkchandra) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతోంది.యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు.

లేటెస్ట్ గా హీరో సాయి శ్రీనివాస్ బర్త్డే సందర్బంగా టైటిల్ ఫిక్స్ చేస్తూ..పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అతనికి ఉన్న గొప్ప శక్తితో..గొప్ప బాధ్యతతో..డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్గా టైసన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు..ఆంటూ మేకర్స్ ట్వీట్ చేశారు.

ఇక గ్లింప్స్లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లో శ్రీనివాస్ అదరగొట్టాడు. 'సార్..బాగా బలిసిన దున్నపోతు రంకెలు వేస్తూ మీ ముందుకు వచ్చింది. మీరు గాల్లో ఎగురుతూ ఒక బ్లైండ్ క్లిక్ ఇచ్చారు. అప్పుడు ఏం జరుగుతుంది? అని ఒకరు ప్రశ్నిస్తే..'దున్నపోతు చచ్చిపోతుంది' అని ట్రైనింగ్ ఇస్తున్న వ్యక్తి సమాధానం చెబుతారు.ఆ డైలాగ్ వైరల్ అయ్యేలా ఉంది.

ఇక బాక్సింగ్ రింగ్లో కూడా గెలిచి టైసన్ నాయుడు అనిపించుకున్నట్లు టైటిల్ రివీల్ చేశారు. బెల్లంకొండ ముచ్చటగా మూడో సారి ఖాకీ చొక్కా తొడుక్కోబోతున్నాడు. గతంలో కవచం, రాక్షసుడు సినిమాల‌లో పోలీస్ రోల్స్లో నటించి మెప్పించాడు. 

కాగా ఈ సినిమాకు ధమాఖా,బలగం సినిమాలకు మ్యూజిక్ ఇచ్చిన భీమ్స్ సిసిరోలియో స్వరాలూ అందిస్తున్నారు. విజయ్, వెంకట్, రియల్ సతీశ్ మాస్టర్లు యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.