
బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas).. హీరోకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నే ఉన్నప్పటికి ఎందుకో ఈ హీరో సక్సెస్ కాలేకపోతున్నాడు. మొదటి సినిమానే వీవీ వినాయక్ తో చేసి ఇండస్ట్రీలోకి భారీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఓ మోస్తరుగా బాగానే ఆడింది. కానీ, ఏంటో ఆ తరువాత చేసిన ఏ ఒక్క సినిమా కూడా సరిగా ఆడలేదు. అయినప్పటికి అవకాశాలు మాత్రం బాగానే రాబట్టుకున్నాడు. మధ్యలో వచ్చిన రాక్షసుడు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అది కూడా తమిళ్ రీమేక్ అవడం కారణంగా.
ఇక అక్కడి నుండి హిట్టు కోసం మనోడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఫైనల్ గా బాలీవుడ్ లో కూడా ట్రై చేశాడు అక్కడ కూడా వర్కౌట్ అవలేదు. ప్రభాస్ ఛత్రపతి సినిమాను అదే పేరుతో హిందీలో రీమేక్ చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. కానీ, ఆ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం టైసన్ నాయుడు సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు ఈ హీరో. భీమ్లా నాయక్ వంటి సినిమాను తెరకెక్కించిన సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే.. ఈ సినిమా తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ చేయబోతే సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమా కోసం డిజాస్టర్ డైరెక్టర్ ను సెలెక్ట్ చేసుకున్నాడట. ఆ దర్శకుడు మరెవరో కాదు చావు కబురు చల్లగాతో ప్లాప్ ప్లాప్ ఇచ్చిన కౌశిక్ పెగళ్లపాటి. ఈ దర్శకుడు చెప్పిన ఫాంటసీ థ్రిల్లర్ కథ బెల్లంకొండ హీరోకి బాగా నచ్చిందట. అందుకే.. ఈ సినిమాకు వెంటనే ఒకే చెప్పేశాడట. అంతేకాదు.. దర్శకుడి మీద నమ్మకంతో భారీ బడ్జెట్ పెడుతున్నాడట మేకర్స్. మరి ప్లాప్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.