IND vs ENG 5th Test: కోహ్లీని గుర్తు చేశావుగా: గిల్ సిక్సర్‌కు బిత్తరపోయిన ఇంగ్లాండ్ కెప్టెన్

IND vs ENG 5th Test: కోహ్లీని గుర్తు చేశావుగా: గిల్ సిక్సర్‌కు బిత్తరపోయిన ఇంగ్లాండ్ కెప్టెన్

క్రికెట్ లో కొన్ని షాట్స్ మాత్రం ఊహకు అసలు అందవు. ఇప్పటివరకు ఎన్ని షాట్స్ చూసినా ఆ క్షణం కొట్టిన షాట్ కొత్తగా కనిపిస్తుంది. తాజాగా ధర్మాశాల టెస్టులో టీమిండియా యంగ్ స్టార్ శుభమాన్ గిల్ ఆడిన షాట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. గిల్ కొట్టిన ఒక సిక్సర్ కు ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ మైండ్ బ్లాంక్ అయింది.
 
రెండో రోజు ఆటలో భాగంగా అండర్సన్ గుడ్ లెంగ్త్ డెలివరీ వేశాడు. ఈ బంతిని క్రీజ్ బయటకు వచ్చి గిల్ సిక్సర్ బాదేశాడు. గిల్ కొట్టిన ఈ స్ట్రెయిట్ సిక్సర్ చేస్తే క్రికెట్ లో వన్ ఆఫ్ ది క్లాసికల్ షాట్ అని చెప్పవచ్చు. లెజెండరీ బౌలర్ అండర్సన్ బౌలింగ్ లో ధైర్యంగా క్రీజ్ ధాటి రావడమే కాకుండా గిల్ ఇచ్చిన పోజ్ ఔరా అనిపించేలా ఉంది. ఈ సిక్సర్ ను చూసి స్టోక్స్ స్టన్నయ్యాడు. అంత సింపుల్ గా.. అలా ఎలా కొట్టేస్తావు అనేట్టుగా వింత ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. స్టేడియంలో ప్రేక్షకులు ఈ సిక్సర్ ను చూసి నోరెళ్ళ బెట్టారు. ఈ సిక్సర్ గతంలో విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాపై కొట్టిన స్ట్రెయిట్ సిక్సర్ ను గుర్తు చేసింది.  

ALSO READ :- దొంగతనంగా పాకిస్తానీ ఎంట్రీ.. అర కిలోమీటర్ దూరం నుంచే కాల్చి చంపిన భారత సైన్యం

 
ఈ మ్యాచ్ మొత్తంలో చూడముచ్చటైన షాట్లతో అలరించిన గిల్ 110 పరుగులు చేసి ఔటయ్యాడు. గిల్ ఇన్నింగ్స్ లో 5 భారీ సిక్సర్లతో పాటు 12 ఫోర్లున్నాయి. టెస్ట్ కెరీర్ లో ఈ పంజాబీ ఆటగాడికి ఇది నాలుగో సెంచరీ కాగా ఈ సిరీస్ లో రెండవది. గిల్ తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ చేయడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం దిశగా వెళ్తుంది. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 457 పరుగులు చేసింది.