దొంగతనంగా పాకిస్తానీ ఎంట్రీ.. అర కిలోమీటర్ దూరం నుంచే కాల్చి చంపిన భారత సైన్యం

దొంగతనంగా పాకిస్తానీ ఎంట్రీ.. అర కిలోమీటర్ దూరం నుంచే కాల్చి చంపిన భారత సైన్యం

రాజస్థాన్‌, గంగానగర్ జిల్లా శ్రీ కరణ్‌పూర్ సమీపంలోని భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పులు కలకలం రేపాయి. అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నించిన పాకిస్థాన్ చొరబాటుదారుడిని సరిహద్దు భద్రతా దళాలు(బిఎస్‌ఎఫ్) కాల్చి చంపాయి. గురువారం(మార్చి 7) అర్థ రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. 

చొరబాటుదారుడు గురు- శుక్రవారం మధ్య రాత్రి పాకిస్తాన్ వైపు భారత్‌లోకి ప్రవేశించాడనికి సరిహద్దు కంచె వెంబడి అనుమానాస్పదంగా ముందుకు సాగాడని అధికారులు పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యలుగా బిఎస్‌ఎఫ్ దళాలు చొరబాటుదారుడిపై కాల్పులు జరిపాయని  వెల్లడించారు. ప్రోటోకాల్స్ ప్రకారం మృతదేహాన్ని పోలీసులకు అప్పగిస్తున్నట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. 

పాక్ పౌరుడు అరెస్ట్

అంతకుముందు మార్చి 7న, అమృత్‌సర్‌లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు కంచె సమీపంలో ఒక పాకిస్తానీ పౌరుడిని బిఎస్‌ఎఫ్ పట్టుకుంది. మార్చి 6న అర్థ రాత్రి దాటాక సరిహద్దు కంచెకు ముందు ప్రాంతంలో ఒక వ్యక్తి యొక్క అనుమానాస్పద కదలికను గమనించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. పట్టుబడిన పాకిస్థానీని పంజాబ్ పోలీసులకు అప్పగించినట్లు బీఎస్ఎఫ్ పేర్కొంది.

ALSO READ :- తెలంగాణని హెల్త్ డిస్టినేషన్‌గా తీర్చిదిద్దుతాం: ఆరోగ్య శాక మంత్రి