
లండన్: ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. బుధవారం జరిగిన ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని డాక్టర్లు ప్రకటించారు. దీంతో వచ్చే ఏడాది జనవరిలో ఇండియాతో జరిగే టెస్ట్ సిరీస్‌కు స్టోక్స్ పూర్తి ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉండే చాన్స్ ఉంది. ‘సర్జరీ సక్సెస్ అయ్యింది. రిహాబిలిటేషన్ మొదలైంది. వీలైనంత త్వరగా కోలుకునేందుకు ట్రై చేస్తా’ అని స్టోక్స్ ట్విటర్‌లో పేర్కొన్నాడు. మోకాలి గాయంతో ఇబ్బందిపడుతున్న స్టోక్స్ ఈ ఏడాది ఆసీస్‌తో జరిగిన యాషెస్ చివరి మూడు టెస్ట్‌ల్లో బౌలింగ్ చేయలేకపోయాడు. అయితే బ్యాటర్‌గా ఇండియాలో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో బరిలోకి దిగినా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. అప్పుడే సర్జరీ చేయించుకోవాలని స్టోక్స్ డిసైడ్ అయ్యాడు.