2 నెలల్లో పెరిగిన ఇన్వెస్టర్ల సంపద 39 లక్షల కోట్లు

2 నెలల్లో పెరిగిన ఇన్వెస్టర్ల సంపద 39 లక్షల కోట్లు

ఈ నెలలో ఇప్పటి వరకు రూ. 7.5 లక్షల కోట్లు అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బిజినెస్ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: యూఎస్‌‌‌‌‌‌‌‌లో ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌ దిగిరావడంతో పాటు గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా డాలర్ వాల్యూ పడుతుండడంతో బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు  గురువారం సెషన్‌‌‌‌‌‌‌‌లో కీలక లెవెల్స్‌‌‌‌‌‌‌‌ను క్రాస్ చేశాయి. సెన్సెక్స్ తిరిగి 59 వేల లెవెల్‌‌‌‌‌‌‌‌ను అందుకుంది. నిఫ్టీ 17,700 లెవెల్‌‌‌‌‌‌‌‌ను దాటినా, ఈ లెవెల్‌‌‌‌‌‌‌‌పైన  నిలవలేకపోయింది.  కంపెనీల జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌ కూడా మెప్పించడంతో దేశ స్టాక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లు గురువారం నాలుగు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌ 17 న  నమోదైన కనిష్టాల నుంచి సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌, నిఫ్టీలు 16 శాతం లాభపడగా, ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌లో బీఎస్‌‌‌‌‌‌‌‌ఈలోని కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్‌‌‌‌‌‌‌‌ రూ. 39 లక్షల కోట్లు పెరిగింది. ఈ నెలలో ఇప్పటి వరకు  ఇన్వెస్టర్ల సంపద రూ. 7.5 లక్షల కోట్లు ఎగిసింది. సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌ గురువారం 515 పాయింట్లు (0.81 శాతం) పెరిగి 59,333 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 124 పాయింట్లు ఎగిసి 17,659 వద్ద ముగిసింది.  బీఎస్‌‌‌‌‌‌‌‌ఈ మిడ్‌‌‌‌‌‌‌‌క్యాప్‌‌‌‌‌‌‌‌, స్మాల్‌‌‌‌‌‌‌‌ క్యాప్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు కూడా గురువారం సెషన్‌‌‌‌‌‌‌‌లో ర్యాలీ చేశాయి.  బ్యాంక్‌‌‌‌‌‌‌‌, ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌, ఐటీ, కన్జూమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యూరబుల్స్‌‌‌‌‌‌‌‌, రియల్టీ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు ఒక శాతం కంటే ఎక్కువ పెరిగి గురువారం మార్కెట్ ర్యాలీకి సాయపడ్డాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం 37 పైసలు తగ్గి 79.62 వద్ద సెటిలయ్యింది.

దేశంలోనూ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ కిందకి..

యూఎస్‌‌‌‌‌‌‌‌లో ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌ పీక్ లెవెల్‌‌‌‌‌‌‌‌ను టచ్‌‌‌‌‌‌‌‌ చేసి దిగొస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌లో  ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ 40 ఏళ్ల గరిష్టమైన 9.1 శాతానికి చేరుకుంది. కమోడిటీ రేట్లు ముఖ్యంగా గ్యాస్ ధరలు తగ్గడంతో యూఎస్‌‌‌‌‌‌‌‌లో ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ తగ్గుతూ వస్తోంది. కిందటి నెలకు సంబంధించి యూఎస్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌ 8.5 శాతంగా రికార్డయ్యింది.  ఫెడ్ పెట్టుకున్న 2 శాతం లెవెల్‌‌‌‌‌‌‌‌ కంటే ఈ లెవెల్‌‌‌‌‌‌‌‌  చాలా ఎక్కువే అయినప్పటికీ, ప్రస్తుతానికి యూఎస్‌‌‌‌‌‌‌‌లో ఆర్థిక మాంద్య భయాలు కొంత తగ్గాయని ఎనలిస్టులు చెబుతున్నారు. అంతేకాకుండా ఫెడ్ తన తర్వాత పాలసీ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశాలు కొంత తగ్గాయంటున్నారు. లోకల్‌‌‌‌‌‌‌‌గా చూస్తే జులై  ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ నెంబర్‌‌‌‌‌‌‌‌ను శుక్రవారం (ఆగస్ట్‌‌‌‌‌‌‌‌ 12) ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ విడుదల చేయనుంది. ఆహారపదార్ధాల ధరలు తగ్గడంతో దేశంలో కూడా ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌ తగ్గుతుందనే అంచనాలు ఎక్కువయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో దేశంలో ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ 7.8 శాతానికి పెరిగింది. ఆ తర్వాత నుంచి తగ్గుతూ వస్తోంది. జులై నెలకు సంబంధించి ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ 7 శాతానికి దిగువన నమోదవుతుందని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. ‘దేశంలో ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ పీక్ లెవెల్‌‌‌‌‌‌‌‌ను ఇప్పటికే టచ్‌‌‌‌‌‌‌‌ చేసిందనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ అంచనాల కంటే వేగంగా ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ దిగొస్తోంది. ఈ ఏడాది  అక్టోబర్ నాటికే  రిజర్వ్ బ్యాంక్ పెట్టుకున్న టార్గెట్‌‌‌‌‌‌‌‌ బ్యాండ్‌లోకి వస్తుంది’ అని బేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లేవ్స్‌‌‌‌‌‌‌‌ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్‌‌‌‌‌‌‌‌ రాహుల్ బజోరియా అన్నారు. జులై ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 6.65 శాతంగా ఉంటుందని  ఈ సంస్థ అంచనావేసింది. మరోవైపు ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌లో 109 వద్ద ఆల్‌‌‌‌‌‌‌‌టైమ్‌‌‌‌‌‌‌‌ గరిష్టాన్ని నమోదు చేసిన యూఎస్ డాలర్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌, గురువారం 105 కిందకు దిగొచ్చింది. డాలర్ విలువ గ్లోబల్‌‌‌‌‌‌‌‌ మేజర్ కరెన్సీలతో పోలిస్తే తగ్గడంతో ఇండియాలోకి తిరిగి ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఐల ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లోస్ పెరుగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటి వరకు నికరంగా రూ. 9,500 కోట్ల విలువైన షేర్లను ఎఫ్‌ఐఐలు కొనుగోలు చేశారు. గత పది నెలల్లోనూ వీరు నికర అమ్మకందారులుగా ఉండగా, మొదటిసారిగా ఈ నెలలో నికర కొనుగోలుదారులుగా  కొనసాగుతున్నారు.  

ఎనలిస్టులు ఎమంటున్నారంటే? 

1 ‘ఏడాది ప్రాతిపదికన చూస్తే యూఎస్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌ ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌లో 9.1 శాతానికి పెరిగింది. దీంతో పోలిస్తే జులైలో మెరుగుపడింది. ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌ తగ్గినప్పటికీ, ఫెడ్  తన వైఖరిని మార్చుకోవడానికి ఇది సరిపోదు. భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో యూఎస్ ఆర్థిక వ్యవస్థ రెసిషన్‌‌‌‌‌‌‌‌లోకి జారుకునే అవకాశాలు మాత్రం తగ్గాయి’ 
అని రిలయన్స్ సెక్యూరిటీస్‌‌‌‌‌‌‌‌  రీసెర్చ్ హెడ్‌‌‌‌‌‌‌‌ మితుల్‌‌‌‌‌‌‌‌ షా అన్నారు. 2 ‘కంపెనీల రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌ మెరుగ్గా ఉండడంతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలు పెరగడంతో  మార్కెట్‌‌‌‌‌‌‌‌లు పెరుగుతున్నాయి. మార్కెట్ ఇంకా పెరగొచ్చు. ఇన్వెస్టర్లు  మంచి క్వాలిటీ షేర్లను ఎంచుకోవాలి’ అని హెమ్‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీస్  ఎనలిస్ట్ మోహిత్ నిగమ్  సలహాయిచ్చారు. 3యూఎస్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ డేటా అంచనాల కంటే తక్కువగా ఉండడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడిందని కోటక్‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీస్‌‌‌‌‌‌‌‌ ఈక్విటీ రీసెర్చ్ హెడ్‌‌‌‌‌‌‌‌ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. తర్వాతి పాలసీ మీటింగ్‌‌‌‌‌‌‌‌ ఫెడ్ వడ్డీ రేట్లను తక్కువగా పెంచుతుందనే అంచనాలు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. క్రూడాయిల్ ధరలు తగ్గడం, ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఐల ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లోస్ కొనసాగడంతో కూడా మార్కెట్‌‌‌‌‌‌‌‌ పెరుగుతోందని అన్నారు.