సెన్సెక్స్ 455 పాయింట్లు అప్‌‌

సెన్సెక్స్ 455 పాయింట్లు అప్‌‌

ముంబై: టీసీఎస్‌‌, ఇన్ఫోసిస్ వంటి ఐటీ కంపెనీల షేర్లు  పెరగడంతో బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు మంగళవారం లాభాల్లో ట్రేడయ్యాయి. గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్‌‌గా కదలడం, విదేశీ ఇన్వెస్టర్లు నికర కొనుగోలుదారులుగా  మారడంతో  సోమవారం వచ్చిన నష్టాల నుంచి నిఫ్టీ, సెన్సెక్స్ రికవరీ అయ్యాయి. సెన్సెక్స్‌‌ మంగళవారం సెషన్‌‌లో 455 పాయింట్లు (0.63 శాతం)  పెరిగి 72,186 దగ్గర సెటిలయ్యింది.

నిఫ్టీ 158 పాయింట్లు ఎగసి 21,929 దగ్గర ముగిసింది. చైనీస్ మార్కెట్‌‌లు 4 శాతం వరకు ర్యాలీ చేయడం  కలిసొచ్చిందని ఎనలిస్టులు పేర్కొన్నారు. కాగా, మూడు రోజుల పాటు జరిగే ఆర్‌‌‌‌బీఐ పాలసీ మీటింగ్‌‌ మంగళవారం మొదలయ్యింది. ఈసారి కూడా వడ్డీ రేట్లు మారవని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. మిడిల్ ఈస్ట్‌‌లో సమస్యలు తగ్గుతాయని మార్కెట్‌‌ అంచనా వేస్తోంది. దీంతో ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు  మంగళవారం దూసుకుపోయాయి.

సెన్సెక్స్‌‌లో హెచ్‌‌సీఎల్ టె క్‌‌, టీసీఎస్‌‌, మారుతి, విప్రో, లార్సెన్ అండ్ టుబ్రో, ఇన్ఫోసిస్‌‌, టాటా స్టీల్‌‌, భారతీ ఎయిర్‌‌‌‌టెల్‌‌, ఎస్‌‌బీఐ, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. పవర్‌‌‌‌ గ్రిడ్‌‌, ఇండస్‌‌ఇండ్ బ్యాంక్‌‌, ఐటీసీ, కోటక్ బ్యాంక్‌‌, బజాజ్ ఫిన్సర్వ్‌‌, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. 

Also Read:ముస్లిం దేశంలో మొదటి హిందూ దేవాలయం