
మోడీని కోరిన మమతాబెనర్జీ
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ పేరును బంగ్లాగా మార్చాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. ప్రధానిని ఆయన ఇంట్లో బుధవారం మమత కలుసుకున్నారు. ఈ సందర్భంగా పేరు మార్చుతూ ఇంతకుముందు రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానం చేసిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు ఆమె మీడియాకు చెప్పారు. దీనిపై ప్రధాని సానుకూలంగా స్పందించారని తెలిపారు. మోడీతో మీటింగ్ సంతృప్తికరంగా ముగిసిందని మమతా చెప్పారు. బిర్భూమ్‌లోని కోల్ ఫీల్డ్ ప్రాజెక్టును జెండా ఊపి ప్రారంభించాలని పీఎంను కోరానని మమతా మీడియాకు చెప్పారు. కుర్తా, స్వీట్లు ఇచ్చి ప్రధానికి బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పారు. రెండోసారి ప్రధాని అయిన తర్వాత మోడీని బెంగాల్ సీఎం కలవడం ఇదే మొదటిసారి.