ప్రజాస్వామ్యంపై దాడి: మమతా బెనర్జీ

ప్రజాస్వామ్యంపై దాడి: మమతా బెనర్జీ

కోల్‌‌‌‌కతా: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌‌‌‌ను ఈడీ అరెస్టు చేయడాన్ని తృణమూల్​కాంగ్రెస్​(టీఎంసీ) అధినేత, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని ఆమె అభివర్ణించారు. కేజ్రీవాల్ అరెస్టును తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, కేజ్రీవాల్​భార్య సునీతకు మద్దతు తెలిపానని మమత శుక్రవారం ఎక్స్​లో పోస్ట్​చేశారు. బీజేపీ కేవలం ప్రతిపక్ష ముఖ్యమంత్రులనే లక్ష్యంగా చేసుకోవడం దారుణమని మమత మండిపడ్డారు. 

సీబీఐ, ఈడీ దర్యాప్తులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు బీజేపీతో పొత్తుపెట్టుకుంటే వారిపై ఎలాంటి చర్యలు ఉండవని ఆమె విమర్శించారు. ప్రతిపక్ష నేతల అరెస్టులపై అభ్యంతరం వ్యక్తం చేసేందుకు ఇండియా కూటమి ప్రతినిధులు ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు మమత ప్రకటించారు.