మోదీ మళ్లీ గెలిస్తే ఎన్నికలుండవు: సీఎం మమతా

మోదీ మళ్లీ గెలిస్తే ఎన్నికలుండవు: సీఎం మమతా

కోల్ కతా: ప్రధాని మోదీ మళ్లీ గెలిచి అధికారాన్ని చేపడితే దేశంలో మళ్లీ ఎన్నికలనేవి ఉండవని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక సీఏఏను రద్దు చేస్తామని ‘దీదీ’ హామీనిచ్చారు. బుధవారం కోల్‌‌కతాలోని పార్టీ హెడ్డాఫీసులో మేనిఫెస్టోను విడుదల చేశారు. 

బీపీఎల్ కింద ఉన్న కుటుంబాలకు ఏటా 10 ఉచిత గ్యాస్‌‌ సిలిండర్లు, ఇంటింటికీ రేషన్ అందిస్తామని చెప్పారు. బీజేపీ మొత్తం దేశాన్ని నిర్బంధ శిబిరంగా మార్చిందని విమర్శించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ మాట్లాడుతూ.. దేశంలో సామాన్యుడికి భారంగా మారిన పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రిస్తామని చెప్పారు. ఇందుకోసం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.