బెంగళూరు ఆటోవాలా ట్రెండింగ్.. నెలకు ఆదాయం రూ.3లక్షలు.. రూ.5 కోట్ల ప్రాపర్టీకి ఓనర్ అంట!

బెంగళూరు ఆటోవాలా ట్రెండింగ్.. నెలకు ఆదాయం రూ.3లక్షలు.. రూ.5 కోట్ల ప్రాపర్టీకి ఓనర్ అంట!

బెంగళూరులో నివసిస్తున్న ఆకాష్ అనే ఇంజనీర్ ప్రయాణం కోసం ఓ ఆటో ఎక్కాడు. అయితే దానిని నడుపుతున్న ఆటోవాలతో మాటలు కలపగా అతను చెప్పిన విషయాలు తనకు కళ్లు తెరిపించినట్లు ఆ ఇంజనీర్ చెప్పాడు.  

తాను ఎక్కిన ఆటో నడుపుతున్న వ్యక్తి ఆపిల్ వాట్, ఐపాడ్ వాడటం చూసి మాట కలిపాడు. అయితే వారాంతంలో ఇలా ఆటో నడుపుతానని.. ఇదే తనకు మెుదట అన్నం పెట్టిందని ఆటో అన్న చెప్పాడు. తనకు బెంగళూరులో 2 సొంత ఇళ్లు ఉన్నాయని వాటి విలువ రూ.4 నుంచి రూ.5 కోట్ల మధ్య ఉంటుందని చెప్పుకొచ్చాడు. పైగా వాటి నుంచి రెంటల్ ఆదాయం నెలకు రూ.2-3 లక్షలు సంపాదిస్తున్నట్లు చెప్పటంతో ఇంజనీర్ ఒక్కసారిగా షాకైపోయాడు. 

ALSO READ : విడాకులు ఇచ్చిన కొడుక్కి తల్లి పాలాభిషేకం

అయితే మ్యాటర్ ఇక్కడితో అయిపోలేదు. సదరు ఆటో యజమానికి ఒక ఏఐ స్టార్టప్ కంపెనీలో పెట్టుబడులు కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సదరు టెక్కీ ఆటో డ్రైవరుతో జరిగిన ముచ్చట్ల సారాంశాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయటంతో ఇది తెగ వైరల్ అవుతోంది. బెంగళూరులో ఆటో డ్రైవర్లు కూడా ఇన్వెస్టర్లుగా మారిపోతున్నారని కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరొకరు బెంగళూరులో ఉన్న ఒంటరితనాన్ని అధిగమించటానికి ఇలా టాక్సీ డ్రైవర్లుగా మారుతుంటారని, అది డబ్బు కోసం కాదని మరొకరు పోస్ట్ పెట్టారు.