విడాకులు ఇచ్చిన కొడుక్కి తల్లి పాలాభిషేకం : కొత్త పెళ్లి కొడుకులా హ్యాపీ డైవర్స్ కేక్ కటింగ్

విడాకులు ఇచ్చిన కొడుక్కి తల్లి పాలాభిషేకం : కొత్త పెళ్లి కొడుకులా హ్యాపీ డైవర్స్ కేక్ కటింగ్

పెళ్లంటే నూరేళ్ల జీవితం అనే రోజులుపోయి.. నూరేళ్ల మంట అనే కాడికి వచ్చింది. భార్య అర్థభాగం అని రోజులుపోయి.. ఆస్తిలో సగభాగం అనే కాలానికి వచ్చాయి రోజులు.. మగాళ్లను చూసి భయపడే రోజులుపోయి.. ఆడోళ్లను చూసి భయపడే రోజులు వచ్చేశాయి అనటానికి ఇటీవల జరుగుతున్న ఘటనలే నిదర్శనం.. లేటెస్ట్ గా ఢిల్లీలో జరిగిన ఓ ఘటన దేశం మొత్తాన్ని షాక్ కు గురి చేసింది. ప్రతి భార్యాభర్తనే కాదు ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన రియల్ స్టోరీ ఇది.. 

ఢిల్లీకి చెందిన డీకే బిరాదర్.. భార్యకు విడాకుల తర్వాత అతని కుటుంబం, అతను చేసిన పని ఇప్పుడు హైలెట్ అవుతుంది. భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత అతని తల్లి కొడుక్కి పాలాభిషేకం చేస్తుంది. దేవుడికి అభిషేకం చేసినట్లు.. కొడుక్కి ఇంట్లో పాలతో శుద్ధి చేస్తుంది. 

ఆ తర్వాత కొత్త బట్టలు వేసుకుంటాడు.. కొత్త షూ.. కొత్త వాచీ.. ఇలా అన్నీ కొత్తవి ధరిస్తాడు. ఆ తర్వాత హ్యాపీ డైవర్స్.. విజయవంతమైన విడాకులు అనే కేక్ కట్ చేస్తాడు. కేక్ పై భార్యకు భరణంగా ఇచ్చింది కూడా రాశాడు. 120 గ్రాముల బంగారం, 18 లక్షల డబ్బుతో హ్యాపీ డైవర్స్ అని రాసి ఉంటుంది. ఈ కేక్ కట్ చేసి తల్లికి తినిపించి.. తాను కూడా తింటాడు. ఈ వీడియో ఇన్ స్ట్రాలో వైరల్ అయ్యింది. హ్యాపీ డైవర్స్ పై పెద్ద ఎత్తున చర్చ జరగటం మొదలైంది. విడాకుల తర్వాత ఆ కుటుంబం ఎంత హ్యాపీగా ఉందో ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. 

వీడియోతో అతను షేర్ చేసిన క్యాప్షన్ ఇలా ఉంది. 120 గ్రాముల బంగారం, 18 లక్షల రూపాయల డబ్బును నేను తీసుకోలేదు.. నేను ఇచ్చాను. ఇప్పుడు నేను ఒంటరిగా.. సంతోషంగా.. స్వేచ్ఛగా ఉన్నాను. నా జీవితం.. నా పద్దతులు నాకు ఉన్నాయి. దీంతోపాటు సంతోషం కూడా వచ్చింది. 

ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ పోస్టర్ అయిపోయింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. నెటిజన్ల రియాక్షన్ చూస్తే.. ఎక్కువగా పాజిటివ్ రావటం విశేషం. వీళ్ల సెలబ్రేషన్స్ చూస్తుంటే.. అతని మాజీ భార్య ఎంత టార్చర్ పెట్టిందో అర్థం అవుతుంది అంటూ ఓ నెటిజన్ స్పందించాడు. జీవితాంతం నరకంలో బతికే కంటే.. ఇలా విడిపోయి హ్యాపీగా ఉండటమే బెటర్ అని మరికొందరు స్పందించారు. 

ALSO READ :  నా పెళ్లాం రాత్రులు పాముగా మారి కాటేస్తుంది.. !

ఏ తల్లి అయిన కొడుక్కి పెళ్లి చేయాలని భావిస్తుంది.. కొడుక్కి పెళ్లి చేసి సంతోషిస్తుంది.. అలాంటిది కొడుకు విడాకులు ఇస్తే తల్లి పాలాభిషేకం చేసింది అంటే.. వచ్చిన ఆ కోడలు ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిందో.. ఎంత నరకం చూపించిందో.. ఎలాంటిదో అర్థం అవుతుంది అంటూ ఎక్కువ మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..

ఏదిఏమైనా ఇప్పుడు అయితే ఈ విడాకుల హీరో ఇంటర్నెట్ ట్రెండింగ్ అయ్యాడు..