నవ్వొద్దు సీరియస్ మేటర్ : నా పెళ్లాం రాత్రులు పాముగా మారి కాటేస్తుంది.. !

నవ్వొద్దు సీరియస్ మేటర్ : నా పెళ్లాం రాత్రులు పాముగా మారి కాటేస్తుంది.. !

టైటిల్ చూసి షాకయ్యారా.. అవాక్కయ్యారా.. అస్సలు నవ్వొద్దు.. ఇది చాలా చాలా సీరియస్ మేటర్. ఇది అఫిషియల్ గా వచ్చిన కంప్లయింట్.. జిల్లా కలెక్టర్ కు ఓ వ్యక్తి.. రాతపూర్వకంగా ఇచ్చిన స్టేట్ మెంట్.. దీనిపైన విచారణ కూడా జరిగింది.. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది అంటారా.. మన దేశంలోనే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో.. ఈ స్టోరీ పూర్తిగా తెలుసుకోవాలనుందా.. వివరాల్లోకి వెళదాం..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. సీతాపూర్ జిల్లా. మహమూదాబాద్ ఏరియాలోని లోద్సా గ్రామం. 2025, అక్టోబర్ 6వ తేదీ సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తు్న్నారు జిల్లా కలెక్టర్. లోద్సా గ్రామం నుంచి మెరాజ్ అనే వ్యక్తి వచ్చాడు. అతను ఇచ్చిన కంప్లయింట్ ఇలా ఉంది.. 
సార్.. నా భార్య రాత్రి పూట పాముగా మారుతుంది.. నన్ను కాటు వేస్తుంది. నా భార్య రాత్రి పూట పాముగా మారి నన్ను చంపటానికి ప్రయత్నిస్తుంది. ఇలా ఒకసారి చేసింది. చాలా సార్లు నేను తప్పించుకున్నాను. రాత్రి పూట నా భార్య పాముగా మారి నన్ను చంపటానికి ప్రయత్నించినప్పుడు నేను మేల్కొని ఇంట్లో నుంచి పారిపోయేవాడిని. నా భార్య పాముగా మారుతుంది.. నా భార్య నుంచి నన్ను కాపాడండి.. నన్ను చంపటానికి నా భార్య చాలా సార్లు ప్రయత్నించింది.. అర్థరాత్రులు నేను తన నుంచి తప్పించుకోవటానికి పరిగెత్తాను.. పాముగా మారిన నా భార్య నా వెంట పరిగెడుతుంది అంటూ జిల్లా కలెక్టర్ కు చెప్పుకొచ్చాడు.. అంతేనా రిటర్న్ కంప్లయింట్ కూడా ఇచ్చాడు.. 

ఈ కంప్లయింట్ చూసి జిల్లా కలెక్టర్ తోపాటు అందరూ షాక్ అయ్యారు. నవ్వాలో ఏడ్వాలో కూడా అర్థం కాలేదు. అధికారికంగా ఓ వ్యక్తి స్వయంగా కంప్లయింట్ ఇవ్వటంతో.. జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించాడు. అధికారులు రంగంలోకి దిగారు. లోద్సా గ్రామం వెళ్లి మెరాజ్ ఇంటి చుట్టుపక్కల, అతని భార్యను విచారించారు. ఇంట్లో మానసిక వేధింపులుగా నిర్థారించారు అధికారులు. అతని భార్య వల్ల అతను మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు తేల్చారు. 

ALSO READ : దగ్గు సిరప్ ఫ్యాక్టరీలో బయటపడ్డ కల్తీ భాగోతం.. 

దీనిపై సోషల్ మీడియా ఫన్నీగా స్పందించింది. నీ భార్య నాగిని కావొచ్చు.. నువ్వు దాచిన నాగమణి తిరిగి ఇచ్చేయ్ అంటూ కామెంట్ చేస్తే.. మరో నెటిజన్.. నీ భార్య పాముగా మారితే నువ్వు కోబ్రాగా మారు అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. నువ్వు మరోసారి శ్రీదేవిని గుర్తు చేశావ్.. 1986లో వచ్చిన నాగిని పాముగా మారే శ్రీదేవి గుర్తుకొచ్చింది అంటూ కామెంట్ చేశాడు మరో నెటిజన్.. 

మొత్తానికి ఈ స్టోరీ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫన్నీ ఫన్నీ కామెంట్స్ తో నెటిజన్లను హుషార్ చేసింది.