ఐటీ ప్రొఫెషనల్స్​కు బెస్ట్​ సిటీ: రెండో స్థానంలో హైదరాబాద్

ఐటీ ప్రొఫెషనల్స్​కు బెస్ట్​ సిటీ: రెండో స్థానంలో హైదరాబాద్
  • హైదరాబాద్​ సెకెండ్.. పుణెకు థర్డ్​ ప్లేస్

ముంబై: దేశంలో ఐటీ ప్రొఫెషనల్స్​కు బెస్ట్​ సిటీగా బెంగళూరు నిలిచింది. ట్రాఫిక్​ కష్టాలు ఎన్ని ఉన్నా సరే.. హై లివింగ్​ స్టాండర్డ్స్, హైయ్యస్ట్​ అప్రైజల్స్, కెరీర్​ గ్రౌత్​ ఆపర్చునిటీస్​ మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకుంటే బెంగూరు బెస్ట్​అని ఐటీ ప్రొఫెషనల్స్​ భావిస్తున్నట్టు తాజా సర్వేలో వెల్లడించింది. 40 శాతం మందికిపైగా ఐటీ ప్రొఫెషనల్స్​ పని చేయడాని బెస్ట్​ సిటీ బెంగళూరు అని ఓటేసినట్టు టెక్​ జిగ్​ సర్వే ప్రకటించింది. ఈ లిస్ట్​లో హైదరాబాద్​ 13 శాతం ఓట్లతో సెకండ్​ ప్లేస్ దక్కించుకుంది. 11 శాతం ఓట్లతో పుణె థర్డ్​ ప్లేస్​లో నిలిచింది. ఆ తర్వాత ప్లేస్​లో కోల్​కతా, ఢిల్లీ ఉన్నాయి. ఏప్రిల్​ మొదటి వారంలో ఆన్​లైన్​లో నిర్వహించిన ఈ సర్వేలో 25–35 ఏండ్ల వయసు, కనీసరం రెండేండ్ల వర్క్​ ఎక్స్​ పీరియన్స్​ ఉన్న దాదాపు 1,830 మంది ఐటీ ప్రొఫెషన్స్​ అభిప్రాయాలను సేకరించారు. బెంగళూరులో హై లివింగ్​ స్టాండర్డ్స్​ ఉన్నాయని దాదాపు 58 శాతం మంది ఐటీ ప్రొఫెషనల్స్​ భావిస్తున్నారు. 57 శాతం మంది తమకు తాముగా బెంగళూరు వచ్చి పనిచేస్తున్నామని చెప్పినట్టు ఈ సర్వే వెల్లడించింది. సిటీ మారండం గురించి ఫ్యూచర్​ ప్లాన్స్​ ఏమిటని ప్రశ్నించగా.. తమకు ఆ ఇంట్రెస్ట్​ లేదని ఎక్కువ మంది సమాధానం ఇచ్చినట్టు పేర్కొంది. ఎక్స్​పీరియన్స్​డ్​ ప్రొఫెషనల్స్, ఫ్రెషర్లకు బెస్ట్​ ఆపర్చునిటీస్​ అందించడంలో బెంగళూరు టాప్​ లో ఉందని 61 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఐటీ సెక్టార్​లో కెరీర్​ను సరిగ్గా మొదలుపెట్టడానికి బెంగళూరు కరెక్ట్​ సిటీ అని వీరంతా చెప్పారు.