ఏంట్రా ఈ దోపిడీ : ప్రీమియం పార్కింగ్ అంట.. గంటకు వెయ్యి రూపాయలు

ఏంట్రా ఈ దోపిడీ : ప్రీమియం పార్కింగ్ అంట.. గంటకు వెయ్యి రూపాయలు

ఏడుకొండలు ఎక్కితే నిలువు దోపిడి జరుగుతుందని వెనకటికి పెద్దలు అనేవారు.. కాల క్రమేనా అది అలాగే ఆనవాయితీగా వస్తుంది... కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది... నిలువు దోపిడికి గురి కావాలంటే ఏడుకొండలే ఎక్కాల్సిన అవసరం లేదు... పెద్ద నగరాల్లోని ఏదైనా షాపింగ్ మాల్ కు వెళితే చాలు.. ఉన్నది లేనిది అంతా మన దగ్గర నుంచి లాగేస్తారు.  

షాపింగ్ కు వెళితే నిన్నటి దాక కొన్న వస్తువులకే డబ్బులు కట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు.. షాపింగ్ కు తీసుకెళ్లిన కారుకు కూడా డబ్బులు కట్టాలి... కారుకు డబ్బులు కట్టడమేంటి అనుకుంటున్నారా.. అదేనండి కారు పార్కింగ్ చేయాలాంటే గంటకు వెయ్యి రూపాయలు కట్టాలి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వివరాల్లోకి వెళితే..

బెంగుళూరులోని  యూబీ సిటీ షాపింగ్ మాల్ కొత్త ఆఫర్ తెచ్చింది. షాపింగ్ మాల్ కు వచ్చిన కస్టమర్స్ కార్లు కాని ఏదైనా వెహికల్ కానీ తెచ్చినట్టైతే "ప్రీమియం పార్కింగ్" కోసం గంటకు ₹ 1,000 వసూలు చేస్తోంది. సైన్ బోర్డ్‌ని చూపించి మరి డబ్బులు వసూల్ చేస్తుండటంతో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫోటోలపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. 

"బెంగళూరు నిర్విరామంగా శాన్ ఫ్రాన్సిస్కోగా మారాలని ప్రయత్నిస్తోందని కొందరు కామెంట్ చేస్తే " రోజుకు సగటున 10 గంటలకు గంటకు రూ.1000 రోజుకు రూ.10,000 అంటే నెలకు రూ.3 లక్షలు, సంవత్సరానికి రూ.36 లక్షలు. ఒక రెండు మూడు సంవత్సరం పార్కింగ్ ఫీజు వసూల్ చేసిన ఆ షాపింగ్ మాల్ లో ఒక షాపు కొనేయవచ్చని కామెంట్స్ చేస్తున్నారు.