రక్తం మరిగిపోతుంది.. 5 వేలు సంపాదిస్తే.. సగం పన్నులకేనా.. ట్యాక్సులు కట్టటానికా ఉద్యోగాలు చేసేది

రక్తం మరిగిపోతుంది.. 5 వేలు సంపాదిస్తే.. సగం పన్నులకేనా.. ట్యాక్సులు కట్టటానికా ఉద్యోగాలు చేసేది

మేం ఉద్యోగాలు చేస్తుంది పన్నులు కట్టటానికా.. మేం సంపాదిస్తుంది ట్యాక్సులు కట్టటానికా.. ఇదీ ఓ నెటిజన్ ఆధారాలతో పెట్టిన ట్విట్టర్ పోస్టు.. ఈ ఒక్క పోస్టు ఇప్పుడు లక్షల మందికి గొంతుక అయ్యాయి. జీఎస్టీ ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉందో.. కష్టపడి సంపాదిస్తున్న సొమ్మును.. ప్రభుత్వం పన్నుల రూపంలో ఏ విధంగా తీసుకుంటుందో ప్రతి ఒక్కరూ తమ అనుభవాలను పంచుకుంటున్నారు. సంచిత్ గోయల్.. బెంగళూరులో ఉద్యోగి. అతను చేసిన ఒకే ఒక్క ట్విట్ ఇప్పుడు జీఎస్టీ బాదుడు ఏ రేంజ్ లో ఉందో స్పష్టం చేస్తుంది. 

ఇవాళ నేను 5 వేల రూపాయలు సంపాదించాను. ఇందులో 30 శాతం ఇన్ కం ట్యాక్స్ కింద ఇచ్చేశాను. మిగిలిన డబ్బులతో బేవరేజీస్.. లిక్కర్ లాంటివి కొనుగోలు చేశాను. 28 శాతం పన్ను కట్టాను. మొత్తంగా 58 శాతం పన్ను రూపంలోనే పోయింది. 12 గంటలు కష్టపడి 5 వేల రూపాయలు సంపాదిస్తే.. నాకు వచ్చిన జ్ణానం ఏంటో తెలుసా.. 12 గంటలు కష్టపడి చేసేది ప్రభుత్వానికి 50 శాతం పన్ను కట్టటానికి అని తెలిసింది అంటూ ట్విట్ చేశారు సంచిత్ గోయల్. 

ఈ ట్విట్ తో ట్యాక్స్ పేయర్లు వీరోచితంగా తమ అనుభవాలను పంచుకున్నారు. అందులో మరో అద్భుతమైన విశ్లేషణ చూద్దాం.. 20 రూపాయల చాకోబార్ పై ప్రభుత్వం ఎంత పన్ను వసూలు చేస్తుంది అనేది ఓ నెటిజన్ వివరంగా చెప్పారు. 

20 రూపాయల చాకోబార్ పై 18 శాతం జీఎస్టీ కడితే.. మూడు రూపాయల 60 పైసలు. పంచధారపై జీఎస్టీ కింద 36 పైసలు, చాక్లెట్ పౌడర్ పై 18 శాతం జీఎస్టీ కింద 9 పైసలు, పాలపై 12 శాతం జీఎస్టీ కింద 6 పైసలు, క్రీంపై 5 శాతం జీఎస్టీ కింద ఒక పైసా వసూలు చేస్తున్నారు. మొత్తంగా 5 రూపాయల 50 పైసలను.. 20 రూపాయల చాకోబార్ పై పన్నుగా తీసుకుంటుంది. అంటే ఇది 27.5 శాతం అన్నమాట. 

 

చాకోబార్ ట్విట్ సైతం వైరల్ అయ్యింది. 20 రూపాయల చాకోబార్ పై ఐదున్నర రూపాయలు ట్యాక్స్ అంటే.. ఇది మధ్యతరగతి, సామాన్యుల నుంచి ఏ స్థాయిలో ప్రభుత్వం పన్నుల రూపంలో దోపిడీ చేస్తుందో అర్థం అవుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

మరో ట్విట్టర్ అయితే.. రక్తం మరిగిపోతుంది.. రోజంతా కష్టపడి పని చేస్తే వచ్చే డబ్బులను పన్నుల రూపంలో తీసుకుని  ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు, పెన్షన్లకు, ఉచిత పథకాలకు పంచి పెడుతుంది అంటూ తన ఆక్రోశాన్ని వెల్లగక్కాడు..

మరో ట్విట్టర్ అయితే.. 50 శాతం పన్ను కడుతున్నా.. ఉద్యోగం పోయినప్పుడు ఈ ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందా ఏంటీ.. కష్టపడిన సొమ్ములో 50 శాతం పన్ను ఎందుకు కట్టాలి అంటూ ప్రశ్నించాడు. 

మంచి పౌరసేవలు, ఉచిత విద్య, వైద్యం, ఆరోగ్యం, నీతి నిజాయితీ పాలన, మంచి వసతులు అందిస్తే ఇంత కంటే ఎక్కువ పన్ను చెల్లించటానికి నేను సిద్ధమే కానీ.. ఇప్పుడు అలా లేదు కదా.. అందుకే నేను కూడా వ్యతిరేకిస్తున్నాను అంటూ మరో నెటిజన్ తన అనుభవాన్ని పంచుకున్నాడు.

మొత్తంగా జీఎస్టీ, ఇన్ కంట్యాక్స్ పేరుతో ట్విట్టర్ ట్రెండ్ నడుస్తుంది. సంచిత్ గోయల్ ట్విట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎంతని పన్నులు కట్టాలనే ప్రశ్న బలంగా వినిపిస్తుంది. ఎంత గొంతు చించుకున్నా.. తగ్గించాల్సిన మహారాజులు ఆలోచిస్తేనే కదా అంటున్నారు మరికొంత మంది నెటిజన్లు...