బెంగళూరు ఫేమస్ పబ్లో మంటలు.. ఉలిక్కిపడిన సిటీ

బెంగళూరు ఫేమస్ పబ్లో మంటలు.. ఉలిక్కిపడిన సిటీ

కర్ణాటకలోని బెంగళూరులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కోరమంగళ ప్రాంతంలోని   ఓ బిల్డింగ్  నాలుగో అంతస్తులో ఉండే ఓ పబ్ లో  భారీగా  మంటలు ఎగసిపడ్డాయి.  భవనంలో మంటలు చెలరేగిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భవనం పైనుంచి కూడా పేలుళ్లు జరుగుతున్నట్లు వీడియోలో  కనిపిస్తోంది. భవనం కింది అంతస్తు నుంచి కూడా మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ ఘటనలో అక్కడున్న వారంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. 

 ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.  షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయని, అయితే ఇంకా నిర్ధారించలేమని చెప్పారు.   బెంగళూరులోని తావరేకెరె మెయిన్ రోడ్డులోని ప్రముఖ పబ్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

బిల్డింగులో చెలరేగిన భారీ మంటల నుంచి ఓ వ్యక్తి తనను తాను రక్షించుకోవడానికి  నాల్గవ అంతస్తు నుండి దూకాడు.  అయితే అతను ఎవరనేది వివరాలు తెలియాల్సి ఉంది.  అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.