
బెంగళూరు: కరోనా కేసుల సంఖ్య ఉధృతంగా పెరిగితే బెంగళూరు సిటీలో లాక్‌డౌన్ విధింపుపై ఆలోచిస్తామని కర్నాటక హెల్త్ మినిస్టర్ బి.శ్రీరాములు తెలిపారు. ‘బెంగళూరులో కేసులు పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నాలుగు ప్లేస్‌లను సీఎం యడ్యూరప్ప గుర్తించడంతో.. వాటిని 14 రోజుల వరకు సీల్ చేశాం. అలాగే పరిస్థితి తీవ్రంగా ఉన్న కొన్ని స్ట్రీట్స్‌నూ సీల్ చేస్తున్నాం. ఎక్స్‌పర్ట్స్ ఇచ్చే రిపోర్ట్స్‌లను పరిశీస్తున్నాం. ఒకవేళ రాబోయే రోజుల్లో పరిస్థితి ఇలాగే ఉంటే మళ్లీ లాక్‌డౌన్ విధించడంపై సమాలోచనలు చేస్తాం. ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది ప్రజలు కర్నాటకకు రావడాన్ని మేం గమనిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితిని అదుపు చేయడంపై నిపుణుల సలహాలు తీసుకుంటాం. అలాగే దీనిపై కీలక నిర్ణయం తీసుకోవడానికి ముందు సీఎంతో చర్చిస్తాం’ అని శ్రీరాములు చెప్పారు.