ఉదయం సాఫ్ట్ వేర్.. సాయంత్రం ర్యాపిడో.. బుల్లెట్ బండిపై డెలివరీలు

ఉదయం సాఫ్ట్ వేర్.. సాయంత్రం ర్యాపిడో.. బుల్లెట్ బండిపై డెలివరీలు

కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో ఓ కారులోనో.. ఓ ప్రత్యేకమైన వెహికిల్ లోనో వెళితే ఆ అనుభూతి వేరు. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతాం.  అలాంటి ఫీలింగే బెంగళూరులో ఓ వ్యక్తి కలిగింది. ఎప్పుడూ రద్దీగా ఉండే బెంగళూరులో.. ఓ ప్రత్యేక ఈవెంట్ వెళ్లాల్సి ఉండగా.. రాపిడో బుక్ చేసిన అతనికి కార్పొరేట్ లెవెల్లో ఆతిథ్యం లభించింది. నిషిత్ పటేల్ అనే ట్విట్టర్ యూజర్ తనకు కలిగిన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. 
ఓ ఈవెంట్ కు వెళ్లిన్పుడు రాపిడో బుకింగ్ తో తనకు ఓ వింత అనుభూతి కలిగిందని నిషిత్ పటేల్ తెలిపారు. కుబెర్నెటీస్ మీట్ ఆప్ కి వెళ్తున్నపుడు.. తను బుక్ చేసుకున్న రాపిడో కెప్టెన్ రాయల్ ఎన్ ఫీల్డ్ ను ఎంచుకున్నట్లు తెలిపాడు. అతను Enterprise Kubernetes క్లస్టర్లను నిర్వహించే కంపెనీలో డెవలప్ మెంట్ ఇంజనీర్ అని తెలిపాడు.  

అతనికి రూ. 80 చెల్లించని తర్వాత ఇద్దరం ఈవెంట్ కి వెళ్లాం.. టెక్ క్యాపిటల్ బెంగళూరులో ఇది నాకు మరువలేని రోజు అని నిషిత్ పటేల్ తెలిపాడు.

నిషిత్ పటేల్ కు ఎదురైన అనుభవాన్ని  నెటిజన్లతో పంచుకుంన్నాడు. ఈ ట్వీట్ పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే నెటిజన్లు భారీ సంఖ్యలో స్పందించారు.  బ్రో.. అతని సైడ్ బిజినెస్ తో ఎంత టర్నోవర్ చేస్తుందో అడిగారా అని ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు సరదాగా..