
కేంద్రం నిధులన్నింటిని దక్షిణాది నుంచి ఉత్తరాది కి మళ్లిస్తోందని బెంగుళూరు రూరల్ కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దక్షిణ భారతీయుల కష్టాలను కేంద్రం పట్టించుకోకుండా కొనసాగితే త్వరలో దక్షిణ భారతీయులకోసం ప్రత్యేక దేశం కోసం డిమాండ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. సురేష్ కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు .
దక్షిణాది రాష్ట్రాలపై గ్రాంట్ వివక్ష కేంద్రం కొనసాగిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే దక్షిణ భారతీయుల ప్రత్యేక దేశం కోసం గళం విప్పడం అనివార్యమన్నారు సురేష్. మన వాటా మనకు అందడం లేదని డీకే సురేష్ అన్నారు. రాష్ట్రం, రాష్ట్రం డబ్బును ఉత్తర భారతానికి ఖర్చు పెడుతుందన్నారు. కేంద్రం రాష్ట్రానికి అన్ని విషయాల్లో అన్యాయం చేస్తోందన్నారు. హిందీ వాళ్లు మాపై ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్రానికి గ్రాంట్లు కేటాయింపు లో ఎప్పుడు అన్యాయం జరుగుతోందని డీకే సురేష్ అన్నారు.
బడ్జెట్ పై స్పందించిన డీకే సురేష్.. ఇది ఎన్నికల బడ్జెట్ అని విమర్శించారు. ఇందులో కొత్తేమీ లేదని అన్నారు. మధ్యంతర బడ్జెట్ లో పేర్లు మాత్రమే మార్చారు.. కొన్ని సంస్కృత పేర్లను పథకాలు పెట్టారని అన్నారు.
అయితే మరో వైపు కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే సురేష్ వ్యాఖ్యలపై బీజేపీ నేత కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మండిపడ్డారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నాయకులతో కలిసి భారతదేశాన్ని ఏకం చేసేందుకు యత్నించారు. ఇవాళ రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ.. దేశాన్ని విభజించేందుకు అవినీతి పరుడుగా జైలు కు వెళ్లొచ్చిన డీకే శివకుమార్ లాంటి నేతలతో కలిసి పనిచేస్తున్నారని విమర్శించారు.