బస్సులో ప్రయాణించిన వీధికుక్క.. వీడియో వైరల్

బస్సులో ప్రయాణించిన వీధికుక్క.. వీడియో వైరల్

బీఎంటీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఇండీ కుక్క సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఓ వైపు మంచి నడవడిక, తెలివితేటలతో హృదయాలను కొల్లగొడుతుండగా, మరోవైపు వీధికుక్కలను ఎక్కిస్తే బెంగళూరు బస్సుల్లో ప్రయాణించడం సురక్షితమేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటన మారతల్లి నుంచి ఇందిరానగర్‌కు వెళుతున్న BMTC బస్సులో జరిగినట్లు సమాచారం. మంచి ప్రవర్తన కలిగిన ఈ కుక్క ఓ ప్రయాణీకుడి పెంపుడు జంతువుగా తెలుస్తోంది. ఈ సమయంలోనే అక్కడే ఉన్న కొందరు ఆ కుక్కను వీడియో తీయడం కూడా ఇందులో చూడవచ్చు.

ఈ వైరల్ క్లిప్‌ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పలు కామెంట్లు పెడుతూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. BMTC బస్సులో పెంపుడు జంతువులకు చట్టబద్ధంగా అనుమతి ఉందని, హాఫ్ టిక్కెట్‌తో ప్రయాణించవచ్చని కొందరు తెలిపారు. అయితే మరికొందరు మాత్రం కుక్కలను పట్టీలు లేకుండా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించడానికి అనుమతించడం వల్ల కలిగే భద్రతా ప్రమాదాలను ఎత్తి చూపారు. ఇది ఎవరినైనా కొరికి తీవ్రంగా గాయపరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రశ్నించారు.