జీర్ణించుకోలేని నెటిజన్లు : ఒక్క రోజులో అద్దె ఇల్లు ఎలా దొరికిద్ది.. టూ మచ్ ఇది

జీర్ణించుకోలేని నెటిజన్లు : ఒక్క రోజులో అద్దె ఇల్లు ఎలా దొరికిద్ది.. టూ మచ్ ఇది

బెంగుళూరులోని అద్దెదారులు అద్దె ఇళ్ల కోసం ఎంత కష్టపడతారో.. వారు ఎదుర్కొంటున్న కష్టాలు, సవాళ్ల గురించి వినడం ఇంటర్నెట్‌లో సాధారణంగా కనిపించేదే. కానీ రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన దీనికి పూర్తి విరుద్ధం. కేవలం ఒక రోజులోనే అద్దెకు ఇళ్లు దొరికిందట. ఇది తెలిసిన చాలా మంది బెంగుళూరు వాసులు  'యాంటీ-పీక్ బెంగళూరు' క్షణంగా పరిగణిస్తూ.. అసూయతో కనబరుస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

మైక్రో-బ్లాగింగ్ సైట్ 'X'లో గ్రేప్‌వైన్ యాప్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సౌమిల్ త్రిపాఠి ఈ ఘటనకు సంబంధించిన ఓ ఫొటో స్క్రీన్‌షాట్‌ ను షేర్ చేశారు. ఇందులో ఓ వ్యక్తికి చెందిన వేగవంతమైన ప్రయాణాన్ని పంచుకున్నారు. ఈ స్క్రీన్‌షాట్‌ లో.. గురువారం బెంగళూరుకు వచ్చారని, శుక్రవారం కోరమంగళలోని ఒక బ్రోకర్‌తో సమావేశమయ్యారని, శనివారం నాటికి స్థలాన్ని ఖరారు చేశారని, ఆదివారం వారి కొత్త నివాసంలోకి మారినట్టు ఉంది.

ఈ పోస్టుపై నెటిజన్లు పలు రకాలుగా స్పందించడం మొదలుపెట్టారు. కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. మరికొందరు మాత్రం ఈ తరహా ఘటనలకు గల కారణాలను చెప్పారు. ఇలా జరగడం చాలా కష్టం.. కానీ ఎక్కువ డబ్బు పెడితే ఇలాంటివి సాధ్యం కావొచ్చు అని ఇంకొందరు అన్నారు. ఇటీవలి కాలంలో బెంగుళూరులో చాలా కంపెనీలు ఉద్యోగులను తీసేయడం వల్ల ఇండ్లు ఖాళీ అయ్యాయని.. దాని వల్ల ద్దె ఇళ్లకు డిమాండ్ తగ్గిందని మరికొందరు చెప్పారు.