శెభాష్ మహిళ : ఫ్లిప్కార్ట్లో అధికధర..రూ.20 వేలు వసూలు చేసింది

శెభాష్ మహిళ : ఫ్లిప్కార్ట్లో అధికధర..రూ.20 వేలు వసూలు చేసింది

ఆన్లైన్లో ఓ వస్తువు కొన్నాం.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధర చెల్లించాం అని తెలిస్తే.. సహజంగా అయితే ఏదో పోనీలే.. మళ్లీ వాళ్లతో ఎందుకు గొడవ అని లైట్ తీసుకుంటాం.. బెంగళూరులోని ఓ మహిళ ఇలా అనుకోలేదు.. కొన్నది షాంపూనే కదా అని లైట్ కూడా తీసుకోలేదు.. పోయింది వందలు, వేల రూపాయలు కాదు కదా అని వదిలేయలేదు.. మోసం జరిగింది అని ఫీలయ్యింది.. ఏకంగా ఫ్లీప్ కార్టుపై కోర్టులో కేసు వేసింది.. కేసు గెలిచింది కూడా.. 90 రూపాయలకు ఇప్పుడు 20 వేల రూపాయలు గెలిచింది. ఆ మహిళకు 20 వేల రూపాయలు అనేది మ్యాటర్ కాదు.. ఆన్లైన్లో మోసపోయాను అని మాత్రమే ఫీలయ్యింది..పూర్తి వివరాల్లోకి వెళితే..

బెంగళూరులోని ప్యాలెస్ గుట్ట హల్లి నివాసి సౌమ్య  2019 అక్టోబర్ లో జరిగిన భారీ బిలియన్ డేస్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ నుంచి షాంపూని కొన్నది. ఆమె కొనుగోలు చేసిన పతంజలి హెయిర్ క్లెన్సర్  అసలు ధర రూ. 95 మాత్రమే.. అయితే ఆమెను నుంచి రూ. 191 వసూలు చేశారు. దీంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఫ్లిప్ కార్ట్ కస్టమర్ సర్వీస్ కు ఫిర్యాదు చేసింది. అక్కడ ఆమెకు రీఫండ్ చేస్తామని చెప్పారు. 

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ నుంచి ఎంతకీ సమాధానం రాకపోవడంతో ఆమె బాగా కోపమొచ్చింది. న్యాయం కోసం ఫ్లిప్ కార్ట్ పై దావా వేసింది. బెంగళూరు 4 అడిషనల్ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్పూట్స్ రీడ్రెసల్  కమిషన్ లో ఫిర్యాదు చేసింది. అధిక ధరలకు షాంపూ బాటిల్ ను విక్రయించినందుకు ఫ్లిప్ కార్ట్, హచ్ బీకే ఎంటర్ ప్రైజెస్ పై ఫిర్యాదు చేసింది. స్వయంగా ఆమె ఫిర్యాదును దాఖలు చేసింది. కేసుకు సంబంధించిన అన్ని పత్రాలు కూడా సమర్పించింది. 

కస్టమర్ పై అధిక ఛార్జీలు వసూలు చేయడంపై ఫ్లిప్ కార్ట్ కంపెనీ, హెచ్ బీకే ఎంటర్ ప్రైజెస్ లు కోర్టుకు ఎటువంటి సమాధానం చెప్పలేకపోవడంతో సౌమ్యకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది జడ్జి. వినియోగదారులకు సేవలందించడంతో లోపానికి పరిహారంగా రూ. 10వేలు, కోర్టు ఛార్జీలు రూ. 5వేలు, మోసపూరిత వ్యాపారం చేసినందుకు రూ. 5వేల చొప్పున మొత్తం రూ.20 వేలు కస్టమర్ సౌమ్యకు ఫ్లిప్ కార్ట్ సంస్థ చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 

సౌమ్య తాను ఖర్చు చేసిన 95 రూపాయల గురించి కాకుండా.. తాను మోసపోయినందుకు ఫ్లిఫ్ కార్టుపై దావా వేసింది. సౌమ్య లా ప్రతి  ఒక్కరూ ఆలోచిస్తే.. కొంతైన మోసాలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు ఈ విషయం తెలిసిన నెటిజన్లు..