ఐకియాకు రూ.3 వేల ఫైన్.. 20 రూపాయల దగ్గర కక్కుర్తి

ఐకియాకు రూ.3 వేల ఫైన్.. 20 రూపాయల దగ్గర కక్కుర్తి

బెంగళూరు IKEA సూపర్ మార్కెట్ పై కేసు వేసింది.  20 రూపాయిల క్యారీ బ్యాగు కోసం IKEA యాజమాన్యం  3 వేల రూపాయిలు కట్టాల్సి వచ్చింది.  

వివరాల్లోకివెళ్తే

 సంగీత బోహ్రా అనే మహిళ 2022 అక్టోబర్ 6 న బెంగళూరులోని IKEA మాల్ లో షాపింగ్ చేసింది.  అప్పుడు  ఆమె 2వేల 428 రూపాయిలు  విలువైన వస్తువులను కొనుగోలు చేసింది.  ఆ తరువాత క్యారీ బ్యాగ్ అడగడంతో IKEA లోగో ఉన్న  క్యారీ బ్యాగ్‌ ఇచ్చి  రూ.20 వసూలు చేశారు. కంపెనీ బ్రాండింగ్‌ను కలిగి ఉన్న బ్యాగ్‌ల కోసం కస్టమర్‌లు ఎలా వసూలు చేయలేరని వాదించింది.  అయినా షాపు యాజమాన్యం పట్టించుకోలేదు.   స్టోర్ లోగో ముద్రించి ఉన్న బ్యాక్ పై రూ.20 వసూలు చేయటంతో ఆమె వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. 

రూ. 20 ల కవర్.. రూ. 3 వేలు ఫైన్

ఆమె స్టోర్లో కొనుగోలు చేసిన వస్తువులను తీసుకెళ్లడానికి పేపర్ బ్యాగ్‌కు ఛార్జీ విధించినందుకు పరిహారంగా రూ.3,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది.  20 రూపాయిల కవరుకు వడ్డీతో కలిపి నష్టపరిహారం రూ.1,000, న్యాయపరమైన ఖర్చులకు రూ.2,000 చెల్లించాలని ఆదేశించింది. 

వస్తువులను డెలివరీ చేసే స్థితిలో ఉంచేందుకు అవసరమైన అన్ని ఖర్చులను విక్రేతలే బరించాల్సి ఉంటుందని స్టేట్ కమిషన్ పేర్కొంది. ఇదే క్రమంలో వినియోగదారులు తమ సొంత బ్యాగులను తీసుకెళ్లేందుకు IKEA  యజమాన్యం అనుమతించటం లేదని గుర్తించింది. 

ఒక వినియోగదారుడు 15 ప్రదేశాల్లో 15 వివిధ వస్తువులను కొనుగోలు చేసినప్పడు అందుకోసం ప్రత్యేకంగా ఇంటి నుంచి అన్ని క్యారీబ్యాగులు తీసుకువాలని మేము ఊహించటం లేదంటూ న్యాయస్థానం పేర్కొంది. ఇందులో ఇచ్చిన తీర్పు ప్రకారం విధించిన జరిమానాను 30 రోజుల్లోగా చెల్లించాలని తీర్పులో స్పష్టం చేసింది.

ALSO READ: వీడు మనిషేనా.. కాపాడాల్సింది పోయి.. వీడియో తీస్తూ ఎంజాయి చేశాడు

 దేశంలోని మెట్రో నగరాల్లో ఉండే చాలా మంది ప్రజలకు ఐకియా తెలుసు. 1943లో స్వీడన్‌లో స్థాపించబడిన కంపెనీ.. ఫర్నిచర్, గృహోపకరణాలను స్వయంగా డిజైన్ చేసి, తయారుచేసి విక్రయిస్తోంది. 2008 నుంచి విడిగా ఫర్నిచర్ అమ్మడంలో ప్రపంచంలోనే నెం.1 కంపెనీగా నిలిచింది. 2017 నవంబర్ నాటికి 49 దేశాల్లో 415 స్టోర్లను కలిగి ఉంది. అయితే స్వీడిష్ ఫర్నీచర్ రిటైలర్ IKEA బెంగళూరులోని ఒక కస్టమర్‌కు రీఫండ్ ఇవ్వాలని వినియోగదారు కోర్టు ఆదేశించింది.