లోకేష్ కనగరాజ్, లారెన్స్ కాంబినేషన్‌‌‌‌లో బెంజ్ చిత్రం

లోకేష్ కనగరాజ్, లారెన్స్ కాంబినేషన్‌‌‌‌లో బెంజ్ చిత్రం

కొరియోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌గా, దర్శకుడిగా, నటుడిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు రాఘవ లారెన్స్. ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆదివారం తన కొత్త చిత్రాలకు సంబంధించి క్రేజీ అనౌన్స్‌‌‌‌మెంట్స్ వచ్చాయి. వాటిలో ఒకటి లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌‌‌‌లో తెరకెక్కుతోన్న  చిత్రం ‘బెంజ్’. ఈ చిత్రానికి లోకేష్ కథను అందిస్తూ సుదన్ సుందరం, జగదీష్ పళనిసామితో కలిసి నిర్మిస్తున్నాడు. 

భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు నిన్ననే ఇంకో సినిమాను అనౌన్స్ చేశారు. వెంకట్ మోహన్ డైరెక్షన్‌‌‌‌లో ‘హంటర్’ చిత్రాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా లారెన్స్ పులిపై గన్ పట్టుకుని నీడలాగా కనిపిస్తున్న పోస్టర్‌‌‌‌‌‌‌‌ ఆకట్టుకుంది. అలాగే ‘ఆత్మ కోసం యుద్ధం’ అంటూ రాసుండటం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మనీష్ షా, సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ  చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే సమ్మర్‌‌‌‌‌‌‌‌కి సినిమా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.