ODI World Cup 2023: వరల్డ్ కప్‌ చరిత్రలో బెస్ట్ కెప్టెన్లు వీరే.. ధోనీది ఎన్నో స్థానమంటే..?

ODI World Cup 2023: వరల్డ్ కప్‌ చరిత్రలో బెస్ట్ కెప్టెన్లు వీరే.. ధోనీది ఎన్నో స్థానమంటే..?

మరో రెండు రోజుల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ సమరం ప్రారంభం కాబోతుంది. నెలన్నర పాటు అభిమానులకి వినోదాన్ని ఇవ్వడానికి 10 జట్లు రెడీ అయిపోయాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ మెగా లీగ్.. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది.  ఈ నేపథ్యంలో ఒకసారి వన్డే వరల్డ్ కప్ చరిత్రలో బెస్ట్ కెప్టెన్స్ ఎవరనే విషయం ఇప్పుడు చూద్దాం. 

1) రికీ పాంటింగ్:

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ లిస్టులో అగ్ర స్థానంలో ఉన్నాడు. 1999 ఆసీస్ వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న పాంటింగ్.. ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో జరిగిన 2003 వరల్డ్ కప్ , వెస్టిండీస్ లో జరిగిన 2007 వరల్డ్ కప్ లో కంగారుల జట్టుని జగజ్జేతగా నిలిపాడు. మొత్తం 26 వరల్డ్ కప్ మ్యాచుల్లో ఆస్ట్రేలియాకి విజయాన్ని ఎవరికీ అందనంత దూరంలో నిలిచాడు. అంతేకాదు కెప్టెన్ గా రెండు సార్లు వరల్డ్ కప్ అందించి విండీస్ కెప్టెన్ క్లయివ్ లాయిడ్ సరసన నిలిచాడు.

2)స్టీపెన్ ఫ్లెమింగ్:

ఈ లిస్టులో న్యూజీలాండ్ కెప్టెన్ స్టీపెన్ ఫ్లెమింగ్ పేరు ఉండడం ఆశ్చర్యం కలిగించినా ఇది నిజం. ఒక్క వరల్డ్ కప్ గెలిపించకపోయినా.. ఫ్లెమింగ్ న్యూజీలాండ్ కి వరల్డ్ కప్ లో మెరుగైన ఫలితాలను అందించాడు. 1999, 2003 లో కివీస్ కి నాయకత్వం వహించిన ఫ్లెమింగ్.. మొత్తం 16 విజయాలతో పాంటింగ్ తర్వాత స్థానంలో నిలిచాడు. 1999 లో కివీస్ ని సెమిస్ కి చేర్చిన పాక్ చేతిలో ఓడిపోయింది.

3)క్లయివ్ లాయిడ్:

వెస్టిండీస్ కి చెందిన ఈ దిగ్గజం తొలి రెండుప్రపంచ కప్ లను విండీస్ జట్టుకి అందించి చరిత్ర సృష్టించాడు. 1975, 1979 లో జరిగిన ఈ రెండు వరల్డ్ కప్ లు విండీస్ కి  క్లయివ్ లాయిడ్ అందించగా.. 1983 లో మాత్రం భారత్ చేతిలో ఓడిపోయింది. మొత్తం 15 విజయాలతో ఈ లిస్టులో మూడో స్థానంలో ఉన్నాడు. కెప్టెన్ గా రెండు సార్లు జట్టుకు వరల్డ్ కప్ అందించి తొలి కెప్టెన్ క్లయివ్ లాయిడ్ ప్రత్యేక స్థానం సంపాదించాడు. 

4) మహేంద్ర సింగ్ ధోనీ:

టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ 2011 లో భారత్ కి వరల్డ్ కప్ అందించి 28 ఏళ్ల కళను సాకారం చేసాడు. 1983 లో కపిల్ దేవ్ తర్వాత భారత్ కి వరల్డ్ కప్ అందించిన ధోనీ మొత్తం 14 విజయాలతో ఈ లిస్టులో నాలుగవ స్థానంలో నిలిచాడు. 2011 లో భారత్ ని జగజ్జేతగా నిలిపిన మాహీ.. 2015 ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ కప్ లో భారత్ ని సెమీస్ కి చేర్చాడు. 

5)ఇమ్రాన్ ఖాన్:

పాకిస్థాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ 1983, 1987,1992 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరించాడు. తొలి రెండు వరల్డ్ కప్ లో విఫలమైనా 1992 లో పాకిస్థాన్ కి వరల్డ్ కప్ అందించాడు. మొత్తం 14 విజయాలతో టాప్ 5 లో చోటు సంపాదించాడు.  
  
ఇక వీరితో పాటు కపిల్ దేవ్, అలెన్ బోర్డర్, రణతుంగ, స్టీవ్ వా, మైకేల్ క్లార్క్ ఇయాన్ మోర్గాన్ తక్కువ విజయాలే నమోదు చేసినప్పటికీ తమ జట్టుకి వరల్డ్ కప్ అందించి శిఖరాన నిలిచారు.