Grass cutting smart machines: లాన్ మూవర్తో సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి..ఇది నిజం

Grass cutting smart machines: లాన్ మూవర్తో సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి..ఇది నిజం

మీ ఇంట్లో గడ్డిని కత్తిరించే స్మార్ట్ మెషీన్లు ఉన్నాయా.. అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే.. సైబర్ ఎటాక్ జరిగే అవకాశం ఉందంట.. నిజం.. స్మార్ట్ గార్డెన్ మోవర్ ద్వారా కూడా సైబర్ నేరాలు జరుగుతున్నాయట. ఈ విషయం ఓ పరిశోధనలో తేలింది. VPN సర్వీస్ ప్రొవైడర్ ZenSheild  ప్రకారం.. లాన్ మూవర్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి మీ డివైజ్ లను హ్యాక్ చేయవచ్చు. 

గడ్డిని కత్తిరించే స్మార్ట్ మెషీన్లు ఇంటర్నెట్ కనెక్ట్ చేయబడిన పరికరాలలో( ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్)  భాగమవుతాయి.సున్నితమైన పరికరాల్లోకి చొరబడటానికి మార్గాన్ని చూపుతాయని పరిశోధకులు అంటున్నారు. గార్డెన్ మూవర్స్ తో సహా స్మార్ట్ పరికరాలు ఉన్న ఇళ్లలో వారినికి 12 వేల హ్యాకింగ్స్ ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. లాన్ మూవర్ పరికరం ransomware దాడికి ఎంట్రీ పాయింట్ గా మారుతుందని పరిశోధకులు అంటున్నారు. 

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలను సురక్షితంగా ఉంచడానికి డీఫాల్ట్ సెట్టింగ్ లను మార్చడం, సాధారణ సాఫ్ట్ వేర్ అప్ డేట్ లు ఎప్పటికప్పుడు చేయాలని పరిశోధకులు సూచించారు.