కొండగట్టు అంజన్నకు భద్రాద్రి రామయ్య లాంఛనాలు

కొండగట్టు అంజన్నకు భద్రాద్రి రామయ్య లాంఛనాలు

భద్రాచలం, వెలుగు :  కొండగట్టు అంజన్నకు భద్రాద్రి రామయ్య తరుపున లాంఛనాలను ఈవో రమాదేవి మంగళవారం అందజేశారు. హనుమజ్జయంతి సందర్భంగా జరుగుతున్న ఉత్సవాలకు హాజరైన ఈవో పరిపాలన సిబ్బందితో కలిసి కొండగట్టు ఆలయ అధికారులకు పట్టు వస్త్రాలను సమర్పించారు.

 భద్రాచలం రామాలయంలో అంతకుముందు ఉదయం ఆంజనేయస్వామికి పంచామృతాలో అభిషేకం చేసి, హనుమాన్​చాలీసా పారాయణం నిర్వహించారు. అప్పాల, తమలపాకులు, నిమ్మకాయల మాలలను నివేదించారు. సీతారామచంద్రస్వామికి బేడా మండపంలో నిత్య కల్యాణం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.