
భద్రాచలం, వెలుగు : అనుభవం ఉన్న టీచర్లను అకాడమిక్ కమ్యూనిటీ మొబైలిజేషన్ ఆఫీసర్ గా ఎంపిక చేస్తామని ఐటీడీఏ పీవో బి.రాహుల్ అన్నారు. తన చాంబరులో బుధవారం ఎంపిక ప్రక్రియలో భాగంగా వచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు.
గిరిజన విద్యాభివృద్ధి కోసం పాఠశాలల్లో మానిటరింగ్ విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం, బడిమానేసి బడి బయట తిరుగుతున్న పిల్లలను వారికి నచ్చజెప్పిపాఠశాలల్లో చేర్పించడం, పీవో, డీడీ ఆదేశాలను స్కూళ్లలో అమలు పరిచేలా చూడటం లాంటి తదితర అనుభవం ఉన్న వారిని ఈ పోస్టుకు ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పారు. అప్లికేషన్ల ప్రకారం టీచర్లకు పీవో ఇంటర్వ్యూ నిర్వహించారు. త్వరలోనే నియామకం చేపడతామని వెల్లడించారు.