రామయ్య కోటి తలంబ్రాల పంట

రామయ్య కోటి తలంబ్రాల పంట
  • వరి విత్తనాలు, మొక్కలతో పూజలు
  • 12 ఏళ్లుగా కొనసాగుతున్న కోటి తలంబ్రాల యజ్ఞం

భద్రాచలం సీతారామచంద్ర స్వామి కోటి తలంబ్రాల పంటకు ఇవాళ వరి విత్తనాల పూజ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు భక్త బృందం వారు ఈ పూజలు చేశారు. కోరుకొండ నుంచి వరి విత్తనాలు, మొక్కలు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. 
ఆలయ ఈవో శివాజీ చేతులు మీదుగా వరి మొక్కలను భక్త బృందానికి అందజేశారు. 400 వరి మొక్కలను పూల కుండీలలో పండించి, విత్తనాలు స్వయంగా వలిచి భద్రాద్రి రామయ్యకు తలంబ్రాలు అందిస్తామని తెలిపారు. ఈ కోటి తలంబ్రాల యజ్ఞం 12 ఏళ్లుగా కొనసాగిస్తున్నామని వివరించారు.