భద్రాద్రి రామభక్తులపై బాదుడు షురూ!

భద్రాద్రి రామభక్తులపై బాదుడు షురూ!

భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారాముల ఆలయంలో భక్తులపై బాదుడు మొదలైంది. ప్రసాదం, ప్రత్యేక దర్శనం, కేశఖండనలకు ధరలు పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నుంచే పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. ప్రత్యేక దర్శనం టికెట్​గతంలో రూ.50 ఉండగా, రూ.100కు పెంచారు. 100 గ్రాముల లడ్డూ ఇంతకుముందు రూ.20  ఉండగా, తాజాగా రూ.5 పెంచి రూ.25 చేశారు. ఇదివరకు 500 గ్రాముల మహాలడ్డూ  రూ. 100 ఉండగా..ఇప్పుడు దాన్ని 400 గ్రాములకు కుదించి అదే ధర తీసుకోనున్నారు. 200 గ్రాముల పులిహోర రూ.10 ఉండగా, రూ.15 చేశారు. చక్కెర పొంగళి 100 గ్రాములకు రూ.10 తీసుకునేవారు. ప్రస్తుతం మరో రూ.5 పెంచి 15 తీసుకోబోతున్నారు. కేశఖండనకు మరో రూ.5 పెంచి రూ.20 వసూలు చేయనున్నారు.