
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి మూలవరుల ఫొటోలు దుర్వినియోగం కాకుండా దేవస్థానం కాపీ రైట్ హక్కులను పొందింది. ఫొటోలు, చిత్రాలు ఉపయోగించి దేశ, విదేశాల్లో దేవస్థానం కీర్తి, ప్రతిష్ఠలకు భంగం కలిగేలా వ్యవహరించడంతో కాపీ రైట్స్ తీసుకున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు.
ఇకపై ప్రింటర్లు, వ్యాపారులు కాపీరైట్స్ కు భిన్నంగా వ్యవహరిస్తే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.