
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామిని జూన్లో 2,43,512 మంది భక్తులు దర్శించుకున్నారు. గతేడాది జూన్లో 2,03, 210 మంది మాత్రమే రామాలయానికి దర్శనం కోసం వచ్చారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుండటంతో వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. కాగా గురువారం భద్రాద్రి రామయ్యకు గర్భగుడిలో సుప్రభాత సేవను చేశారు.
కల్యాణమూర్తులకు ప్రాకార మండపంలో నిత్య కల్యాణం జరిపించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది.