
భద్రాచలం,వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అసాంఘీక శక్తులు, ఉగ్రదాడుల నేపథ్యంలో ఆలయ రక్షణకు చర్యలు చేపట్టారు. రెండు డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, ఆరు హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్లను ఇందుకోసం ఇటీవలే కొనుగోలు చేశారు.
వాటిని శుక్రవారం నుంచి వినియోగంలోకి తెచ్చారు. కంపెనీదారులు వాటిని ఆలయంలోకి ప్రవేశించే మార్గంలో బిగించారు. హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్లను ఎస్పీఎఫ్ సిబ్బందికి అందజేశారు. అర్చకులు పూజలు నిర్వహించిన అనంతరం వాటిని వినియోగంలోకి తెచ్చారు. అనుమానిత వస్తువులను గుర్తించేందుకు వీటిని ఉపయోగిస్తారు. భక్తుల భద్రత కోసం ఈ చర్యలు చేపట్టినట్లు ఈవో రమాదేవి తెలిపారు.