
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : స్కూళ్ల రీ ఓపెన్ నాటికి బుక్స్ అందిస్తామని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. కొత్తగూడెంలోని పాఠ్యపుస్తకాల గోడౌన్‌ను బుధవారం ఆయన సందర్శించారు. జిల్లాకు అవసరమైన బుక్స్‌లో ఇప్పటికే 70శాత బుక్స్ వచ్చాయన్నారు. మిగిలిన బుక్స్ఈ నెల 25లోపు జిల్లా కేంద్రానికి చేరుకుంటాయని చెప్పారు. మండలాలకు బుక్స్ పంపిణీ చేసే ప్రక్రియను చేపట్టాలన్నారు.
పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ బుక్స్‌ను స్టూడెంట్స్‌కు ఇవ్వనున్నట్టు తెలిపారు. గవర్నమెంట్ స్కూళ్లలో నాణ్యమైన సన్నబియ్యంతో అన్నం పెడుతున్నామని చెప్పారు. ఎక్కువ మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చేరేలా టీచర్స్ ప్లాన్ చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఈఓ వెంకటేశ్వరాచారి, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి నాగరాజశేఖర్, జిల్లా ప్లానింగ్కో ఆర్డినేటర్సతీశ్కుమార్, గోడౌన్ ఇన్చార్జి రవి ప్రతాప్ఉన్నారు.