ఇంటర్మీడియట్​లో బాలుర ఉత్తీర్ణత శాతం పెరగాలి : కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ 

ఇంటర్మీడియట్​లో బాలుర ఉత్తీర్ణత శాతం పెరగాలి : కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ 
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఇంటర్మీడియట్​ ఉత్తీర్ణతలో బాలికల కంటే బాలురు ఎందుకు వెనుకబడి ఉన్నారని, వారి ఉత్తీర్ణత శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ జితేశ్​వి పాటిల్​ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్​లో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటర్​లోనూ డిజిటల్​ ఎడ్యుకేషన్, ఫేషియల్​అటెండెన్స్​ ప్రవేశ పెట్టాలని ఆదేశించారు. జూనియర్​ కాలేజీల నుంచి  ఇంటర్మీడియట్​ ఎగ్జామ్స్​కు అటెండ్​ అవుతున్న సంఖ్యకు యూ డైస్​ ప్లస్​లో నమోదవుతున్న సంఖ్యలో చాలా తేడాలున్నాయన్నారు.

తేడాలున్న కాలేజీల ప్రిన్సిపాల్స్​ను పిలిపించి జిల్లా విద్యాశాఖ ప్లానింగ్​ కో ఆర్డినేటర్​సతీశ్​​ కుమార్​ ఆధ్వర్యంలో విద్యార్థులందరినీ యూడైస్​ ప్లస్​ పోర్టల్​లో నమోదు చేసేలా చూడాలని ఆదేశించారు. జూనియర్​ కాలేజీల్లో పెద్ద మైదానాలున్నప్పటికీ ఇంకుడు గుంతల నిర్మాణాలు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్​ విద్యాచందన, జిల్లా ఇంటర్మీడియట్​ అధికారి వెంకటేశ్వరరావు, డీఈఓ వెంకటేశ్వాచారి, కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.