పంచెకట్టులో తళుక్కుమన్న కలెక్టర్.. ఆకట్టుకున్న ఆహార్యం

పంచెకట్టులో తళుక్కుమన్న కలెక్టర్.. ఆకట్టుకున్న ఆహార్యం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆహార్యం మారింది. ప్యాంటు, షర్ట్ తో ఇన్ షర్ట్ వేసుకొని కనిపించే కలెక్టర్ విభిన్నంగా దర్శనమిచ్చి అందర్నీ ఆకట్టుకున్నారు. అచ్చు రైతులా ఆయన పంచెకట్టులో కనిపించారు. తెల్లటి చొక్కా, జరీ అంచు పంచెలో కలెక్టర్ మెరిసిపోయారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జూన్ 3వ తేదీ శనివారం తెలంగాణ రైతు దినోత్సవం జరిగింది. జిల్లాలోని 67 వ్యవసాయ క్లస్టర్ల రైతు వేదికలు సంబురాలుకు సిద్ధం చేసిన జిల్లా కలెక్టర్ అనుదీప్.. సంప్రదాయ దుస్తుల్లో పాల్వంచ మండలంలోని జగన్నాథపురం రైతు దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. 

విధి నిర్వహణలో ఎపుడు ఫాంట్, షర్ట్ ధరించే కలెక్టర్ సంప్రదాయ దుస్తులతో, మెడలో పచ్చని కండువా ధరించి, హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రైతు దినోత్సవ వేడుకలకు భారీ సంఖ్యలో హాజరైన రైతులు.. ఎప్పుడూ ప్యాంటు, చొక్కా ధరించే జిల్లా కలెక్టర్ పంచెకట్టుతో  రావడంతో ఆనందం వ్యక్తం చేశారు.