నెట్వర్క్, వెలుగు : వజ్రాయుధం కన్నా ఓటు విలువైన ఆయుధమని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్‌తోపాటు పలువురు అధికారులు తెలిపారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల అధికారులు ర్యాలీ నిర్వహించారు.
మానవహారం చేపట్టి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా పలు స్కూళ్లలో నిర్వహించిన ఆయా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
