కొత్తగూడెంలో150 ఫోన్లు బాధితులకు అప్పగింత

కొత్తగూడెంలో150 ఫోన్లు బాధితులకు అప్పగింత

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా వ్యాప్తంగా పోగొట్టుకున్న 150 ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. కొత్తగూడెంలోని జిల్లా ఎస్పీ ఆఫీస్​లో బుధవారం జరిగిన ప్రోగ్రాంలో బాధితులకు ఎస్పీ రోహిత్​ రాజు ఫోన్లను ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఈఐఆర్​ పోర్టల్​ ద్వారా పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేశామన్నారు. గత ఐదు నెలల్లో పోగొట్టుకున్న 743 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు తెలిపారు. 

ఫోన్​ పోయిన వెంటనే బాధితులు సీఈఐఆర్​ పోర్టల్​లో కంప్లైంట్​ చేయాలని సూచించారు. రికవరీ చేయడంలో కృషి చేసిన పోలీస్​ సిబ్బందిని అభినందించారు. ఈ ప్రోగ్రాంలో ఎస్బీ ఇన్స్​పెక్టర్​ శ్రీనివాస్​, ఐటీ సెల్​ ఇన్​చార్జి రాము, ఎస్సై సురేశ్, ఐటీ సెల్​ సిబ్బంది మహేశ్, నరేన్​, నవీన్, నరేశ్ పాల్గొన్నారు.