
మొదటి సినిమా విడుదల కాకుండానే మరో సినిమాలో చాన్సు కొట్టేసి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది హీరోయిన భాగ్య శ్రీ(Bhagyasri). రౌడీ హీరో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న మూవీ షూటింగ్ లో కూడా ఈ అమ్మడు పాల్గొంది. తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటించబోతున్న టాలీవుడ్ సినిమాలో ఈ అమ్మడికి చాన్స్ దక్కిందని తెలుస్తోంది. దుల్కార్ సల్మాన్ హీరోగా సుధాకర్ చెరుకూరి నిర్మించబోతున్న సినిమాతో రవి అనే నూతన దర్శకుడు పరిచయం అవ్వబోతున్నాడు.
సినిమాలో హీరోయిన్ గా భాగ్య శ్రీ బోర్స్ ను ఎంపిక చేసినట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇంత స్పీడ్ గా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు దక్కించుకున్న హీరోయిన్ భాగ్య శ్రీ మాత్రమే. తక్కువ టైంలో పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ అమ్మడు ముందు ముందు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకోవడం ఖాయమని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు అదే మాదిరిగా మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ కూడా తన మొదటి తెలుగు సినిమా విడుదల అవ్వకుండానే మరో ఆఫర్ దక్కించుకుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న సినిమాలో ఈ అమ్మడికి చోటు దక్కింది.