Allu Arjun, David Warner: పుష్ప డైలాగ్తో అదరగొట్టిన డేవిడ్ వార్నర్.. ఫన్నీ రిప్లై ఇచ్చిన బన్నీ

Allu Arjun, David Warner: పుష్ప డైలాగ్తో అదరగొట్టిన డేవిడ్ వార్నర్.. ఫన్నీ రిప్లై ఇచ్చిన బన్నీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే పుష్ప పార్ట్ 1 భారీ విజయాన్ని సాదించిన నేపధ్యంలో పార్ట్ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఇటీవల విడుదలైన పుష్ప 2 టీజర్ ఆంచనాలను మరింత పెంచేసింది. దీంతో ఈ సినిమా రిలీజ్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. పుష్ప సినిమాలో అల్లు అర్జున చెప్పిన పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ అనే డైలాగ్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆ డైలాగే వినిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్స్ సైతం ఆ డైలాగ్ తో రీల్స్ చేశారు. 

ఇపుడు తాజాగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరోసారి ఆ డైలాగ్ ను ట్రెండ్ చేస్తున్నాడు. ఇటీవల ఆయన ఒక బ్రాండ్ యాడ్ షూట్ లో పాల్గొన్నారు. ఆ యాడ్ లో పుష్ప ఫైర్ డైలాగ్ మీ వాడేశారు. దాంతో ఆ యాడ్ కాస్త వైరల్ గా మారింది. ఇక ఆ యాడ్ చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫన్నీ గా రియాక్ట్ అయ్యారు. డేవిడ్ వార్నర్ పెట్టిన పోస్ట్ కు రిప్లయ్ ఇస్తూ.. నవ్వుతున్న ఎమోజీలు జత చేస్తూ థమ్సప్‌ సింబల్‌ ఇచ్చాడు. దాంతో డేవిడ్ చేసిన పోస్ట్ కాస్తా వైరల్ గా మారింది.