భైరతి రణగల్ రిలీజ్ డేట్ ఫిక్స్

భైరతి రణగల్ రిలీజ్ డేట్ ఫిక్స్

కన్నడ స్టార్  శివ రాజ్‌‌‌‌‌‌‌‌ కుమార్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘భైరతి రణగల్’. ఇది ఆయన నటించిన ‘మఫ్తీ’కి ప్రీక్వెల్.  నర్తన్ దర్శకత్వంలో గీతా శివరాజ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్‌‌‌‌‌‌‌‌ డేట్‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్ చేశారు.  

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన  కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  సీరియస్‌‌‌‌‌‌‌‌గా నడుచుకుంటూ ఇంటెన్స్‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తున్న శివరాజ్ కుమార్ ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆగస్టు 15న అల్లు అర్జున్ ‘పుష్ప2’ పాన్ ఇండియా వైడ్‌‌‌‌‌‌‌‌గా విడుదలు వుతుండగా, అదే డేట్‌‌‌‌‌‌‌‌కు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించ టంతో కన్నడలో వీరిద్దరి మధ్య వార్ తప్పేలా లేదనిపిస్తోంది.