తొలి ఇంట్రానాసల్ వ్యాక్సిన్ ధర నిర్ణయించిన భారత్ బయోటెక్

తొలి ఇంట్రానాసల్ వ్యాక్సిన్ ధర నిర్ణయించిన భారత్ బయోటెక్

నాసల్ వ్యాక్సిన్ ఇన్కోవాక్‌ ధరను భారత్ బయోటెక్  ప్రకటించింది. ప్రైవేట్ ఆసుపత్రులకు రూ. 800గా  రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రానికి రూ. 325గా నిర్ణయించింది. నాసల్ వ్యాక్సిన్ ఇన్ కోవాక్ CoWinలో అందుబాటులో ఉంటుందని పేర్కొంది.  

రెండు డోస్‌ల ప్రాథమిక షెడ్యూల్‌, హెటెరోలాగస్ బూస్టర్ డోస్‌గా ఆమోదం పొందిన ప్రపంచంలోని మొట్టమొదటి ఇంట్రానాజిల్ కోవిడ్ వ్యాక్సిన్‌ ఇన్ కోవాక్ అని భారత్ బయోటెక్ ప్రకటించింది. 14 ఏళ్లు పైబడినవారికి మూడో దశ క్లినికల్, హెటెరోలాగస్ ట్రయల్స్‌ను దేశంలోని 9 ప్రాంతాల్లో నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఇక iNCOVACC వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్‌గా ఇవ్వనున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంట్రానాసల్ కొవిడ్-19 వ్యాక్సిన్‌ను జనవరి నెలాఖరులో విడుదల చేయనున్నారు. 

భారత్ బయోటెక్ iNCOVACC.. హెటెరోలాగస్ బూస్టర్ డోస్‌ల ఉపయోగం కోసం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్  నుంచి డిసెంబర్ నెల మొదట్లో ఆమోదం లభించింది. ఈ మేరకు గత శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రకటించారు. 18 ఏళ్లు నిండినవారు కొవాగ్జిన్, కొవిషీల్డ్‌తో పాటు బూస్టర్ డోస్‌గా రెండు చుక్కల ఇన్ కోవాక్ను తీసుకోవచ్చని ఆయన సూచించారు. అమెరికాలో వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన సెయింట్ లూయిస్‌ స్కూల్‌తో కలిసి భారత్ బయోటెక్ ఇన్ కోవాక్  టీకాను అభివృద్ధి చేసింది.