జనవరి తొమ్మిది నుంచి భారత్ కోకింగ్ కోల్ ఐపీఓ

జనవరి తొమ్మిది నుంచి భారత్ కోకింగ్ కోల్ ఐపీఓ

న్యూఢిల్లీ: కోల్ ఇండియా అనుబంధ సంస్థ భారత్ కోకింగ్ కోల్ తన ఐపీఓను జనవరి తొమ్మిదో తేదీన ప్రారంభించనుంది. ఈ ఐపీఓ ద్వారా ప్రమోటర్ కోల్ ఇండియా తనకున్న 46.57 కోట్ల షేర్లను విక్రయిస్తోంది. ఇందులో కొత్త షేర్ల జారీ లేదు కాబట్టి నిధులన్నీ ప్రమోటర్​కే వెళ్తాయి. 

షేర్ల కేటాయింపు జనవరి 14న జరుగుతుంది. బీఎస్ ఈ, ఎన్ ఎస్ ఈ లో జనవరి 16 నుంచి ట్రేడింగ్ మొదలవుతుంది. భారత్ కోకింగ్ కోల్ దేశంలోనే అతిపెద్ద కోకింగ్ కోల్ ఉత్పత్తిదారు. 2025లో ఉత్పత్తి కంపెనీ వాటా 58.50 శాతం ఉంది.