BEL ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. ఐటిఐ, డిప్లొమా చేసినోళ్లు అప్లయ్ చేసుకోవచ్చు..

 BEL ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. ఐటిఐ, డిప్లొమా చేసినోళ్లు అప్లయ్ చేసుకోవచ్చు..

భారత ప్రభుత్వరంగ సంస్థ, నవరత్న కంపెనీ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హైదరాబాద్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ(ఈఏటీ), టెక్నీషియన్– సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 29. 

పోస్టుల సంఖ్య: 30. 

పోస్టులు: ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (ఈఏటీ) 15, టెక్నీషియన్– సి 15. 

ఎలిజిబిలిటీ: ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (ఈఏటీ): గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి మూడేండ్ల ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

టెక్నీషియన్: ఎస్ఎస్ఎల్​సీ, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏడాది అప్రెంటీస్​షిప్ పూర్తి చేసి ఉండాలి. లేదా ఎస్ఎస్ఎల్​సీతోపాటు సంబంధిత విభాగంలో మూడేండ్ల నేషనల్ అప్రెంటీస్​షిప్ సర్టిఫికెట్ ఉండాలి.

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 28 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

అప్లికేషన్లు ప్రారంభం: అక్టోబర్ 08.  

లాస్ట్ డేట్: అక్టోబర్ 29. 

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్​మెన్, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.590.
 

సెలెక్షన్ ప్రాసెస్: తొలుత అప్లికేషన్లు షార్ట్​లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు bel-india.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.